కోదండ రామ్ యూటర్న్ కు కారణం అదేనా

Kodandaram Uturn

మొత్తానికి టీజేఎస్ మెట్టు దిగింది. బెట్టు వీడింది. ఒంటరిగా అయినా ఎన్నికల బరిలోకి దిగుతామని మహాకూటమిలోని ఆపార్టీ మాటిమాటికీ అల్టిమేటం జారీ చేసింది. రేపటి నుండి మీ దోస్తీ కటీఫ్ అన్న పెద్దాయన ఒక్క సారి యూ టర్న్ తీసుకున్నారు. నిన్నటి దాకా బాగా బెట్టు చేసిన కోదండరాం ఇప్పుడు బెట్టు వీడి కాస్త తగ్గారు. మహాకూతమిలోనే కొనసాగుతామని చెప్పి శాంతించారు.
తెలంగాణ‌లో తెరాస ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్యంగా కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, తెజ‌స‌ జ‌ట్టుక‌ట్టిన కూట‌మి మ‌హాకూట‌మి. గ‌త కొంత కాలంగా అభ్య‌ర్థుల ఎంపిక‌, సీట్ల స‌ర్థుబాటు ఓ కొలిక్కి రాకపోవ‌డంతో మ‌హాకూట‌మి నుంచి తెలంగాణ జ‌న స‌మితి బ‌య‌ట‌కు వ‌స్తుందంటూ జోరుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఒక స్టేజ్ లో బీజేపీ తో కలిసి వెళ్దామని, ఒంటరిగా పోటీ చేద్దాం అని కూడా నిర్ణయమ తీసుకున్నట్టు ప్రచారం జరిగింది. తమ పార్టీ శ్రేణులతో జరిపిన కోర్ కమిటీ చర్చలో కూడా కూటమిని వీడాలనే నిర్ణయానికి వచ్చిన కోదండ రాం సార్ మెత్తబడటానికి కారణం తెలంగాణా జనసమితి కొత్తగా ఏర్పాటై తొలిసారి ఎన్నికలకు వెళ్తున్న పార్టీ, అందులోనూ మహాకూటమి పొత్తులలో అభ్యర్థుల ప్రచారం జరగలేదు.
సీట్ల కేటాయింపు జాప్యం తో ఇప్పుడు బయటకు వెళ్లి ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు అవకాశాలు శూన్యం అని భావిస్తున్న తరుణంలో బయటకు వెళ్లి ఒంటరిగా బరిలోకి దిగి పరువు పోగొట్టుకునే బదులు కూటమితో కలిసి గుంపులో గోవిందా అంటే గట్టెక్కే అవకాశం వుందని భావించిన సారూ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. కూటమి కోసం కష్టపదతామని తేల్చేశారు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ మ‌హాకూట‌మిని వీడేది లేదంటూ తేల్చి చెప్పేశారు.తెలంగాణ‌లో అధికార తెరాస పార్టీ నిరంకుశ పాల‌న‌కు వ్య‌తిరేకంగా మ‌హాకూట‌మి ఏర్ప‌డింద‌ని, దీని వ‌ల్ల రాష్ట్రంలో మార్పు వ‌స్తుంద‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నార‌ని, ఆ న‌మ్మ‌కాన్ని మేము నిజం చేస్తామ‌ని కూడా చెప్పేశారు.అభ్య‌ర్థులు ఎంపిక‌, ప్ర‌చార ప‌ర్వంలో వెనుక‌బ‌డి వున్నామ‌న‌డం క‌ర‌క్టే కానీ ఈ రెండు రోజుల్లో సీట్ల విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని, వ‌చ్చిన వెంట‌నే ప్ర‌చారాన్ని ఊహించ‌ని స్థాయిలో మొద‌లుపెడ‌తామ‌ని కోదండ‌రామ్ తెలిపారు. మొత్తానికి కోదండ రాం సార ఊహలను వీడి గ్రౌండ్ రియాల్టీ లోకి వచ్చారు. అందుకే కూటమిలోనే ఉంటామని చెప్పారు.

Kodandaram Uturn, The TJS Party Stepped down ,TJS Party President Kodandaram Uturn, TJS Latest News, Telugu News, Telangana Political News, Congress political New Telugu Update News, Mahakutami Latest News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *