కోడెల పోటీ ఎక్కడ నుండో ?

 Kodela political news

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే చంద్రబాబు టికెట్లు ఇస్తున్న అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుండి 2014 ఎన్నికల్లో విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన కోడెల వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటీ చేస్తారు. తానేమిటో నిరూపించుకోవాలనుకునే నరసరావు పేట నుండా లేకా సత్తెనపల్లి నుండా అనేది ఇప్పుడు గుంటూరు జిల్లా రాజకీయాల్లో చర్చకు దారి తీస్తుంది. అయితే ఈ విషయమై కోడెలను పార్టీ నాయకులు అడిగినా సరే కోడెల చంద్రబాబు ఎక్కడ నుండి పోటీ చెయ్యమని ఆదేశిస్తే అక్కడ నుండి పోటీ చేస్తానని చెప్తున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు ఎక్కడ నుండి పోటీ చెయ్యాలో ఇంకా ఏమి చెప్పలేదని చెప్పారట కోడెల.

నరసరావుపేట నుండి పోటీ చేస్తే కోడెల కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.ఎక్కడ పోగొట్టుకున్నారో..అక్కడే రాబట్టుకోవాలన్నట్లు… కోడెల రెండు సార్లు ఓడిపోయిన నర్సరావుపేటలో మళ్లీ గెలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదుసార్లు వరుసగా నర్సరావుపేట నుంచి పోటీ చేసి కోడెల చరిత్ర సృష్టించారు. 2004లో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకతతో కోడెల ఓటమి పాలయ్యారు , 2009లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో ఆయనకు అనుకూలంగా ఉన్న మండలాలను పొరుగు నియోజకవర్గాల్లో కలపడంతో ఆయన ఓడిపోయారు. అయితే 2014లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. అప్పటి నుండి కోడెల సత్తెనపల్లిలోదాదాపు వెయ్యికోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారని, సత్తెనపల్లి లోనే పట్టు ఎక్కువుంది అని కొందరు నాయకుల అభిప్రాయం. ఆయన మళ్లీ ఇక్కడ నుంచే పోటీ చేస్తారనేది అక్కడి నాయకుల అభిప్రాయం. ఈ నాలుగేళ్లల్లో నర్సరావుపేటలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేశారని నరసరావుపేట కు దూరమైతే ఆయన లేని లోటు పార్టీ నాయకులు, కార్యకర్తలకు కనిపించడంతో పట్టుపట్టి ఎలాగైనా సరే ఈ సారి నర్సరావుపేట నుంచి ఆయనను పోటీ చేయించాలని భావిస్తున్నారు అక్కడి నాయకులు. కోడెలకు కూడా నర్సరావుపేట నుంచే పోటీ చేసి విజయం సాదించాలని వుంది. అటు నరసరావుపేటలోనూ, ఇటు సత్తెనపల్లి లోనూ ఆయనకు వ్యతిరేఖత లేదు. నర్సరావుపేటలోనే ఆయన పోటీ చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు,ఈ సారి మంత్రి అవుతారని చెప్పుకుంటున్నారు కొందరు నాయకులు. ఇంకా అధినేత చంద్రబాబు తనను ఎక్కడా పోటీ చెయ్యమని ఆదేశించలేదు. బాబు సర్వేల ఆధారంగా ఎక్కడ ఎన్నికల బరిలోకి దిగమన్నా తానూ సిద్ధం అని చెప్తున్న కోడెల కు మనసులో నరసరావుపేటనే వుంది. అలాగే టీడీపీ నాయకులు సైతం సత్తెనపల్లి కంటే నరసరావుపేట అయితేనే కోడెలకు బాగుంటుంది అని చెప్తున్నారు. మరి చంద్రబాబు ఎక్కడ నుండి పోటీ చెయ్యమని ఆదేశిస్తారో చూడాలి.

  Kodela Shiva Prasad Rao political news ,Kodela   Kodela Shiva Prasad Rao competition ,Where’s the competition Kodela,   Kodela Shiva Prasad Rao , Gunturu Sathenapalli,  Kodela competition in Narasaraopet or sathenapalli,

Kodela latest news, kodela political news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *