రాష్ట్రంలో కాంగ్రెస్ జెండానే ఎగురుతుందన్న కొండా

konda surekha latest news

టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ కి చేరిన కొండా దంపతులు టీఆర్ఎస్ ఓటమి లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్నారు. పరకాల టికెట్ పై కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వటంతో ఆమె పరకాల లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గతం లో రాజకీయ జీవితం అంతా పరకాలతో ముడిపడిన కొండా దంపతులకు పరకాల ప్రజల నుండి కూడా మద్దతు లభిస్తుంది. కొండా గాలి తో చల్లా ప్రచారం చల్లబడినట్టు స్థానికంగా చర్చ జరుగుతుంది.

ఎవరెన్ని విశ్వశక్తుల్ని ప్రయోగించిన కూడా ఈసారి తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ అధికారమని ఆ పార్టీ ముఖ్య నేత కొండా సురేఖ ఒక ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు. కమిషన్ల రూపంలో దండుకునే డబ్బులతో జేబులు నింపుకోడానికి మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ చూస్తున్నారని ఆమె ఆరోపించారు. వరంగల్ రూరల్ జిల్లా, పరకాల నియోజకవర్గంలో ప్రజలు, పలు పార్టీల కార్యకర్తలు కొండ దంపతుల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కేవలం పరకాల నియోజకవర్గం ప్రజలే కాదు, తెలంగాణా ప్రజలందరూ కేసీఆర్ పాలనపై విసుగుచెందారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయో, కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు గెలిపిద్దామా అని ప్రజలు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారని సురేఖ అన్నారు. ఈసారి ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ ని గద్దెనెక్కించి, తెరాస కి తగిన బుద్ధి చెప్పుతారని కొండా దంపతులు తెలిపారు.

కేసీఆర్ మరియు కెసిఆర్ కుటుంబం చేసే పనులవల్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని సురేఖ విమర్శించారు.. వారి కుటుంబ పాలన కేవలం మాటల్లోనే కానీ చేతల్లో లేదని కొండా సురేఖ ఎద్దేవా చేసారు. ప్రజల సొమ్మును పర్సంటేజ్ రూపంలో కోట్లు దండుకుని, ఆ డబ్బునే ఖర్చుపెట్టి మళ్లీ అధికారంలోకి రావాలనే ఎదవ ఆలోచనలతో కుట్ర పన్నుతున్నారని సురేఖ విమర్శించారు. ఇప్పుడు జరిగే ఎన్నికలలో తెలంగాణలోని మెజారిటీ స్థానాలను అన్నింటిని కాంగ్రెస్ గెలుచుకుంటుందని, ఈసారి తప్పకుండా అధికారంలోకి వస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేపడతామని సురేఖ స్పష్టం చేశారు. దీనికి అందరు సహకరించాలని కొండ దంపతులు కోరారు.

konda surekha latest news,congress leader konda surekha latest news,konda surekha sensaional comments on kcr,congress will win in elections says konda

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *