క్రిష్‌కి గుర‌జాడ పుర‌స్కారం

Krish Director
నేటి త‌రం ద‌ర్శ‌కుల్లో కొత్త త‌ర‌హా జోన‌ర్స్‌తో సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్న ద‌ర్శ‌కుల్లో జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఒకరు. తెలుగుతో పాటు హిందీలో కూడా క్రిష్ సినిమాల‌ను డైరెక్ట్ చేస్తున్నారు. విజ‌య‌న‌గ‌రం గుర‌జాడ సాంస్కృతిక స‌మాఖ్య ఈయ‌న‌కు గురజాడ అవార్డును ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ నెల 30న ఈ వేడుక జ‌ర‌గ‌నుంది. క్రిష్ ప్ర‌స్తుతం స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ‌యోపిక్ `య‌న్‌.టి.ఆర్‌`ను `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు`, `య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు` అనే రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నారు. `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు` జ‌న‌వ‌రి 9న‌, `య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు` జ‌న‌వ‌రి 24న విడుద‌ల కాబోతున్నాయి. నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

Krish Director, Gurajada Award to Director krish , Telugu Movie Director Krish  , Jagarlamudi Krish Gurajada Award, NTR Biopic, NTR Katha Nayakudu, NTR Mahaniyudu , releasing dates Jan 9th, 24th

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *