కేటీఆర్ ఈసీ కి కూడా హుకుం జారీ చేశారా

KTR News

తెలంగాణలో ఎన్నికల వేడి రాజకీయ వర్గాలకు చెమటలు పట్టిస్తుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఏదైనా అక్రమాలకు పాల్పడినట్టు తెలిసినా, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినా ఈసీ కొరడా ఝుళిపిస్తుంది. ఒక పార్టీ చేసే పనులపై మరో పార్టీ నిఘా కొనసాగుతుంది. ఓటర్లను ప్రభావితం చేసే పనులు ఎవరు చేసినా సరే ఎలెక్షన్ కమీషన్ దృష్టికి తీసుకెళతారు ప్రత్యర్ధి పార్టీ నాయకులు. ప్రత్యర్ధి పార్టీ ఫిర్యాదుతో ఈసీ రంగంలోకి దిగుతుంది. కానీ ఏ పార్టీ నాయకులు ఈసీ మీద ఆర్డర్లు వేయరు. ఆదేశించరు. తాము చెప్పింది చెయ్యాలని శాసించరు. ఈ విషయాన్ని మర్చిపోయి ఈసీ కే ఆర్డర్ వేసే స్థాయిలో వుంది నిఇటై వరకు పాలన సాగించిన ఆ పార్టీ. అందుకే ఈసి పనితీరును తప్పు పడుతూ ఈసీ అంటే తమ అధీనంలో పని చేసే విభాగం అన్న చందంగా ప్రవర్తించారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆపద్ధర్మ ప్రభుత్వం లో మంత్రిగా ఉన్న కేటీఆర్ నోటి నుంచి వ‌చ్చిన మాట‌లు విస్మ‌యాన్ని కలిగించాయి. కేటీఆర్ హెచ్చ‌రిక స్వ‌రంతో ఈసీని ఆదేశించ‌టం ఇప్పుడు సంచ‌లనంగా మారింద‌ని చెప్పాలి.ఏపీ పోలీసులు జ‌గిత్యాల జిల్లా ధ‌ర్మ‌పురిలో స‌ర్వేలు చేయ‌టాన్ని త‌ప్పు ప‌ట్ట‌ట‌మే కాదు.. కాంగ్రెస్‌.. టీడీపీలు అరాచకాలు చేస్తున్నారని మండి పడ్డారు. తాము ప్ర‌స్తావించే అంశాల‌పై ఈసీ స్పందించి టీడీపీ… కాంగ్రెస్ అరాచకాలకు చెక్ పెట్టాలని లేకుంటే టీఆర్ఎస్ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించ‌టం షాకింగ్ గా అనిపించింది. ప్రత్యర్ది పార్టీల నాయకులు ఏదైనా తప్పు చేస్తే ఈసీ కి ఫిర్యాదు చేస్తారు కానీ ఇలా తాము చెప్పింది చెయ్యాలనే కమాండ్ ఎవరు ఇవ్వరు. ఈసీ అనేది రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ ను పరిరక్షించే ఒక విభాగం. అలాంటి ఈసీని మీరు చర్య తీసుకుంటారా లేదా మేమే చర్య తీసుకోవాలా అన్నట్టు మాట్లాడిన కేటీఆర్ తీరుపై రాజకీయ నాయకులు మండి పడుతున్నారు. టీఆర్ఎస్ అనేది దేశంలోని చాలా పార్టీల మాదిరి ఒక రాజ‌కీయ పార్టీ మాత్ర‌మే. ఆ విష‌యాన్ని కేటీఆర్ మ‌ర్చిపోయారేమో అని ఫైర్ అవుతున్నారు ప్రత్యర్ధి పార్టీల నాయకులు.
ఈసీకి సైతం వార్నింగ్ ఇచ్చేసిన కేటీఆర్ తీరును తెగింపుగా చూడాలా? బ‌రితెగింపుగా చూడాలాఅన్నది రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ. తాము చెప్పిన‌ట్లుగా ఈసీ స్పందించ‌కుంటే త‌మ కార్య‌క‌ర్త‌లు చేతులుక‌ట్టుకుని కూర్చోబోర‌ని.. ఆ త‌ర్వాత దాడుల‌కు త‌మ బాధ్య‌త ఉండ‌బోద‌ని చెప్ప‌టం దేనికి నిద‌ర్శ‌నం?ఈసీ క‌చ్ఛితంగా స్పందించాల్సిందేన‌ని.. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌రిగినా బాధ్య‌త త‌మ‌ది కాద‌ని చెప్పే కేటీఆర్ మాట‌ల్ని చూస్తే.. ఈ త‌ర‌హాలో ఈసీకి హెచ్చ‌రిక‌లు జారీ చేసిన కేటీఆర్ వైఖ‌రి అందరినీ షాక్ కు గురి చేస్తుంది.

KTR latest News, Elections news in Telangana  , EC Latest News, Telangana Update News, Telugu News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *