లగడపాటి రాజకీయాల్లో రీ ఎంట్రీ అక్కడ నుండేనా

Lagadapati Reentry into politics

సర్వేల స్పెషలిస్ట్ లగడపాటి రాజగోపాల్ షాకింగ్ కామెంట్ చేశారు. పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆంధ్రా ఆక్టోపస్ గా పేరున్న ఆయన సర్వేలకోసం రాజకీయ వర్గాలే కాదు సామాన్య ప్రజలు సైతం ఎదురు చూస్తారు. ఏదైనా సరిగ్గా అంచనా వెయ్యగల ఆనేత రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు. అలాగే ఇంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా రాజకీయాల్లో కాలు పెట్టేందుకు సిద్ధం అయ్యారు. అయితే అది ఎవ్వరూ ఊహించని చోట.. ఎక్కడంటే
సర్వేల స్పెషలిస్ట్ లగడపాటి తాజాగా ఒక కొత్త సంచలన ప్రకటన చేశారు. తానూ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను అని అయితే అందులో వింతేముంది అంటే ఆయన పోటీ చేస్తాను అంటుంది ఆయన ఇంతకాలం పోటీ చేసిన ప్రాంతంలో కాదు. పక్క రాష్ట్రంలో ఆయన పోటీ చేస్తానని చెప్పి షాక్ కు గురి చేశారు. తెలంగాణలో అవకాశం వస్తే తప్పకుండా పోటీ చేస్తానని లగడపాటి వెల్లడించటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అసలు లగడపాటి ఆలోచన వెనుక ఏదైనా కారణం ఉందా అనేది కూడా ఆలోచించాల్సిన అంశం.
లగడపాటి వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయ వర్గాల్లో చర్చకు కారణం అవుతున్నాయి. ఇంతకీ ఏ పార్టీ అయినా లగడపాటికి ఆ మాత్రం భరోసా ఇచ్చిందా అన్నది కూడా ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తుంది. తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో లగడపాటి సర్వే చేసినట్టు తాజాగా ఓ రిపోర్ట్ వైరల్ అయ్యింది. అయితే లగడపాటి రాజగోపాల్ సోషల్ మీడియాలో వస్తున్న సర్వేలతో తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తు సక్సెస్ అవుతుందా లేదా అనేది ప్రజలే చెప్పాలని అన్నారు. డిసెంబర్ 7న ఎన్నికలు అయ్యాక తమ సర్వే వివరాలు బయటపెడతామని లగడపాటి చెప్పుకొచ్చారు. ఇన్ని చెప్పిన ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలంగాణలో అవకాశం వస్తే సమరానికి సై అని చెప్పటం విశేషం

Lagadapati Reentry into politics , Specialist of the Surveys, Lagadapati Rajagopal shocking comment , Lagadapati political news, Telugu News, lagadapati Rajagopal Latest news.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *