కోర్టు బోనులో లాలూ కుమారుడు

Lula Yadav

జైలు గోడ‌ల మ‌ధ్య కాలం వెళ్ల‌దీస్తున్న లాలూకు ఇదొక చేదు వార్త
కొన్ని నెల‌ల కింద‌ట ఆ ఇంట జ‌రిగిన వివాహ వేడుక వైభోగం మ‌రువ‌క‌
మునుపే కోర్టు మెట్లు ఎక్కిన ఆ పుత్ర రత్నం తీరు మీడియాలో ఓ హెడ్ లైన్

ఈ ఏడాది మే 12న అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన ఆర్జేడీ చోటా బాస్ ఇప్పుడు స‌మ‌స్య‌ల్లో ఉన్నారు. భార్య నుంచి విడిపోయేం దుకే నిశ్చ‌యించుకుని ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. కొంత కాలం నుంచి న‌లుగుతున్న వ్య‌వ‌హారం తాజాగా వెలుగులోకి వ‌చ్చి అంద‌రినీ ఆ శ్చర్య‌పరిచింది.కాగా ప్ర‌స్తుతం ఆయ‌న బాలీవుడ్ సినిమాలో హీరో గా నటిస్తున్నారు.మ‌రోవైపు అమ్మాయి త‌ర‌ఫు వాద‌నేంటో అన్న‌ది ఇంత‌వ‌రకూ తెలియ‌రాలేదు.

ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కుమారుడు తేజ్ ప్ర‌దీప్ యాద‌వ్ చిక్కుల్లో ప‌డ్డారు. త‌న భార్య ఐశ్వ‌ర్య రాయ్ నుంచి విడాకులు కోరుతూ కోర్టుని అభ్య‌ర్థించారు. ఇదివ‌ర‌కే ఓ సారి ఆయ‌న విడాకుల విష‌య‌మై అభ్య‌ర్థించిన‌ప్ప‌టికీ కొన్ని సాంకేతిక కార‌ణాల రీత్యా కోర్టు తిర‌స్క‌రించింది. ఈ విష‌య‌మై ఆయ‌న న్యాయ‌వాది య‌శ్వంత్ కుమార్ శ‌ర్మ మాట్లాడుతూ మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగానే వారిరువురూ విడిపోతున్న‌ట్లు తెలిపారు.ఈ సంగ తి త‌న‌కు తెలియ‌నే తెలియ‌ద‌ని లాలూ కుమార్తె మీసాభార‌తి చెబుతున్నారు. కొంత కాలం మంత్రిగా ప‌నిచేసిన తేజ్ ప్ర‌దీప్ దాణా కుంభ‌కోణం నేప థ్యంలో లాలూ జైల్లో ఉండ‌డంతో ప్ర‌స్తుతం పార్టీ బాధ్య‌త‌లు మోస్తున్నారు.

Lula Yadav , Lula Prasad Yadav  latest News, Telugu News, Lalu Prasad yadav  in  Court , Lalu Prasad Yadav Son Pradeep Son , IRCT Lalu Case

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *