కవిత తెలంగాణా శశికళ నమ్మొద్దన్న మధు యాష్కీ గౌడ్

Madhu Ashki Goud

ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మహాకూటమికి త్వరలో త్రీడీ సినిమా చూపిస్తామంటూ టీఆర్ఎస్ ఎంపీ కవిత చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కవిత ఆస్తులు శశికళ ఆస్తులను మించిపోతున్నాయన్నారు. కవితకు ఫాంహౌస్‌లు, ప్రైవేట్ విమానాలు, ఇన్ని కంపెనీలు ఎలా వచ్చాయంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
కంటి వైద్యం కోసం రాష్ట్రపతి స్థాయి వ్యక్తులు హైదరాబాద్‌ వస్తే.. కేసీఆర్ మాత్రం ఢిల్లీ వెళ్లారంటూ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ కలిసేందుకు ఆయన కంటి పరీక్షల సాకుతో ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఇక్కడ కంటివెలుగు పరీక్షలు నిర్వహించి, కేసీఆర్‌ తన కళ్లను పరీక్షించుకునేందుకు మాత్రం ఢిల్లీ వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. మోదీ ప్రేమలో గుడ్డివాడయిన కేసీఆర్‌కు సీమాంధ్రులంటే నచ్చదని, ఎల్వీప్రసాద్‌ హాస్పిటల్ ఆంధ్రావాళ్లదనే కారణంతోనే ఆయన ఢిల్లీ వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో మహాకూటమి గెలుపు ఖాయమని కేసీఆర్ భయపడుతున్నారన్నారు.
అధికారం కోసం గడ్డితినే కేసీఆర్‌ కుటుంబాన్ని సీమాంధ్రులు నమ్మవద్దని మధు యాష్కీ అన్నారు. టీఆర్‌ఎస్‌ నేతల బెదిరింపులకు భయపడొద్దని తెలిపారు. ‘‘కేటీఆర్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారు. గతంలో ఆంధ్రులంతా రాక్షసులు అన్న మాటలు నిజం కాదా? ఆంధ్రవాళ్లకు సిగ్గూ శరం లేదని కేటీఆర్ మాట్లాలేదా? ఆంధ్ర విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ ఆపిన విషయం గుర్తులేదా?’’ అని ప్రశ్నించారు. సీమాంధ్రులకు తాము అండగా ఉంటామని, దాడులను ఎదుర్కొనేందుకు తమ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
‘‘ఆంధ్రులు రాక్షసులంటూ వాళ్ల మనోభవాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించింది నిజం కాదా? తెలంగాణ ప్రజల రక్తం పీల్చుకుని తినండి అంటూ శాపనార్థాలు పెట్టలేదా? ఛీ.. అన్నా, తూ అని ఊసినా సిగ్గూ, శరం లేకుండా ఆంధ్రోళ్లు వెళ్లడం లేదంటూ నీచంగా మాట్లాడిన మాటలు గుర్తుకు రావడం లేదా? ఓటమి కళ్లముందు కనిపిస్తుంటే కేసీఆర్ ఫ్యామిలీకి లాగులు తడుస్తున్నాయి’’ అంటూ మధుయాష్కి టీఆర్ఎస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Madhu Ashki Goud ,Madhu Ashki Goud  says Kavita is Telangana Sashikala , Madhu Ashki Goud  latest News, TRs Party Latest News, TRS and Congress war  , AICC Secretary Madhu Ashki Goud  is comments on TRS M.P Kavitha, Mahakutami Latest News.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *