కూటమిలో అలకలు బుజ్జగింపులు

Mahakutami Latest news

కాంగ్రెసు నేతృత్వంలోని ప్రజా కూటమికి బీటలు వారే సూచనలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ కోరుకున్నది జరిగే అవకాశం కనిపిస్తుంది. సీట్ల సర్దుబాటులో ఎవరి ప్రాధాన్యతలు వారికున్నాయి. ఈ నేపధ్యంలోనే కూటమి లోని పార్టీలు సీట్ల విషయంలో సర్దుకోలేకపోతున్నాయి. రోజులు గడుస్తున్నా సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. తెలంగాణ ప్రజా సమితి సిపిఐ కాంగ్రెసు ఇవ్వజూపిన సీట్లకు ససేమిరా అంటున్నాయి. తమ ప్రాధాన్యతలు చెప్పి అక్కడే ఇవ్వాలని, తాము అడిగినన్ని సీట్లు ఇవ్వాలని కోరుతున్నాయి. మరో వైపు కాంగ్రెస్ లో ఆశావహులు రాజీనామాలకు సిద్ధంగా వున్నారు. ఇప్పటికే ఆందోళనల పర్వం ఊపందుకుంది.
ప్రస్తుతం సిపిఐ నేతలు కాంగ్రెసు తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కేవలం 3 సీట్లు తమకు ఇస్తామని కాంగ్రెసు చెప్పడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీట్ల పంపకంపై కాంగ్రెసు నేతలు లీకులు ఇస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు.దాంతో సిపిఐ, కాంగ్రెసుల మధ్య పొత్తులో ప్రతిష్టంభన ఏర్పడింది. కూటమి నుంచి తప్పుకునేందుకు సిపిఐ సిద్ధపడింది. దాంతో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిపిఐ నేతలను చర్చలకు ఆహ్వానించారు.
సిపిఐ నేతలకు ఆయన ఫోన్ చేసి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అడిగినన్ని సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేస్తామని సిపిఐ హెచ్చరించింది. కాంగ్రెసు నిర్ణయం కోసం సోమవారం సాయంత్రం 4 గంటల వరకు వేచి చూడాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ సిపిఐ నేతలకు ఫోన్ చేశారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. సర్దుకుపోయే ధోరణి పార్టీలలో కనిపించటం లేదు. అలాగే వేల సంఖ్యలో టికెట్ ఆశించిన వారు ఇప్పుడు వూరుకునేలా లేరు. అంతా గందరగోళ వాతావరణం మధ్య ఇంకా సయోధ్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి సీపీఐ, టీజేఎస్ లు శాంతిస్తాయో లేదో తెలియాల్సి వుంది.

Mahakutami Latest news, Congress Latest news, Telugu latest news, telangana mahakutami political news, telangana pcc president uttam kumar reddy news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *