ఖమ్మంలో కూటమి సక్సెస్… ప్రచారంలో ఒక్కటిగా సాగుతున్న కూటమి

Mahakutami Success in Khammam

సంచలన రాజకీయాలకు ఆ జిల్లా కేంద్రం. అందుకే ఇప్పుడు కూడా ఆ జిల్లాలో రాజకీయాలు సంచలనం గానే ఉన్నాయి. రాష్ట్రమంతా ఆందోళనలతో అట్టుడుకుతున్నా ఖమ్మం లో మాత్రం అందరి అంచనాలను అనుమానాలను తల్లకిందులు చేస్తూ మహాకూమటమి భాగస్వామ్య పక్షాల నాయకులు ఒక్క రోజుకే ఒకే పార్టీ అన్నంతగా కలసిపోయారు. మహాకూటమి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్దిగా ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు ఖమ్మం బరిలో దిగారు.
నామా నాగేశ్వరరావుకు టీడీపీతో పాటు మహాకూటమి భాగస్వామ్య పక్షాలు ఘనస్వాగతం పలికాయి. కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణా జనసమితి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నామాకు స్వాగతం పలికారు. నామా రాక సందర్బంగా టిడిపి శ్రేణులు నిర్వహించిన ర్యాలీతో ఖమ్మం పట్టణంలో సందడి నెలకొంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు నామా ర్యాలీ కొనసాగింది. ఎవ్వరూ ఊహించని విధంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నాయి.
ఖమ్మం సీటు కోసం మహాకూటమి భాగస్వామ్య పక్షాలన్నీ చివరి క్షణం వరకూ పోరాడాయి. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, వద్దిరాజు రవిచంద్ర, పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్ సీటు కోసం చివరి క్షణం వరకూ పట్టుబట్టారు. అది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అని తమ సీటు తమకే కేటాయించాలని కాంగ్రెస్ నేతలు ఢీల్లీ స్ధాయిలో పైరవీలు చేశారు. అయినా సరే ఇటు టిడిపి కూడా ఖమ్మం సీటు కోసం గట్టి పట్టుబట్టింది. ఖమ్మంలో టిడిపికి బలముందని, టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీ చేస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ కు నామా నాగేశ్వరరావు ధీటైన అభ్యర్ధి అని టిడిపి కూటమి భాగస్వామ్యపక్షాల పై వత్తిడి తీసుకువచ్చారు. నిజానికి నామా నాగేశ్వరరావుకు.. పార్లమెంట్‌కు పోటీ చేయాలని ఉంది . కార్యకర్తల ఒత్తిడితో నామా నాగేశ్వరరావు ఖమ్మం అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సంసిద్దత వ్యక్తం చేశారు. దీంతో మహాకూటమి ఖమ్మం సీటును టిడిపి కేటాయించక తప్పలేదు.
ఈ పరిస్దితి ఒక్క ఖమ్మంలోనే కాదు మధిరలో సైతం మహాకూటమి నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా బరిలో నిలచిన మల్లు భట్టివిక్రమార్కకు సైతం అక్కడి టిడిపి శ్రేణులు మద్దతు పలుకుతున్నాయి. ఇటీవల బట్టి విక్రమార్క బోనకల్ లో నిర్వహించిన సభకు టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు. మహాకూటమి ఏర్పడితే….మహా కూటమి నుంచి అభ్యర్దులు బరిలో దిగితే…..గ్రామాలలో పరిస్దితి ఎలా ఉంటుంది..? నాయకులు , కార్యకర్తలు విభేదాలు మరచి పని చేస్తారా…? అభ్యర్దుల గెలుపుకు కృషి చేస్తారా …ముఖ్యంగా ఇంతకాలం శత్రువులగా ఉన్న టిడిపి, కాంగ్రెస్ కార్యకర్తలు కలసి పని చేస్తారా..? అన్న సందేహాలకు సమాధానంగా ఖమ్మం టిడిపి, కాంగ్రెస్ పార్టీల తోపాటు కూటమి భాగస్వామ్యపక్షాలు దోస్త్ మేరా దోస్త్ అంటూ కొత్త రాగం ఆలపిస్తున్నాయి. మహాకూటమికి పూర్తి సానుకూల పరిస్థితి ఖమ్మంలో కనిపిస్తోంది. రాష్ట్రం అంతా ఒక వాతావరణం ఉంటె ఖమ్మంలో మాత్రం అందుకు భిన్నంగా స్నేహపూర్వక వాతావరణం కనిపిస్తుంది. ఇది కూటమికి లాభించే అవకాశం ఉంది.

#tsnews , #tsnewschannel ,Mahakutami Success in Khammam , Khammam campaign news,  Khammam mahakutami news, TDP Leader Nama Nageshwer Rao , Congress, CPI, TDP, TJS

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *