టీటీడీపీ కి ఇప్పటికి ముగ్గురు రెబల్స్ షాక్ … నామినేషన్ దాఖలు

Mahakutami TDP Party news

మహాకూటమిలోని పార్టీలకు రెబల్స్ బెడద పట్టుకుంది. టికెట్ల కేటాయింపులో జాప్యం చెయ్యటం ఆ తర్వాత టికెట్లు ప్రకటించటం తో అందులో ఆశావహుల ఆశలు గల్లంతు కావటంతో వారిలో అసమ్మతి నెలకొంది. దీంతో అసమ్మతి పెద్ద ఎత్తున కనిపిస్తుంది.. ముఖ్యంగా టీటీడీపీ లో టికెట్ కోసం పడరాని పాట్లు పడిన నాయకులు ఇప్పుడు టికెట్ రాకపోవటంతో స్వతంత్రులుగా బరిలో ఉండనున్నారు. పోటీ నుండి వైదొలగేది లేదని తేల్చి చెప్తున్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి మువ్వ సత్యనారాయణ, కోదాడ నుంచి మల్లయ్య యాదవ్, ఆలేరు నుంచి బండ్రు శోభారాణి తదితరులు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే మహబూబ్‌నగర్‌లో టీడీపీకి పోటీగా టీజేఎస్‌ అభ్యర్థిని ప్రకటించడంతో ఇక్కడ కూడా చిక్కులు ఎదురవుతున్నాయి. కాగా… ఖైరతాబాద్ నుంచి టీడీపీ రెబెల్‌గా బీఎన్ రెడ్డి, దేవరకద్ర నుంచి సీతాదయాకర్ రెడ్డి, పటాన్‌చెరు నుంచి రెబెల్‌గా నందీశ్వరగౌడ్ తదితరులు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. అయిది వీరిని కాస్త బుజ్జగించి నామినేషన్ల ఉపసంహరణ నాటికి రెబల్స్ పోటీనుంచి తప్పించేందుకు మహాకూటమి నేతలు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటె నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజక వర్గాన్ని మహాకూటమిలో భాగంగా టీడీపీకి కేటాయించాలని టీడీపీ సీనియర్ నేత రాజా కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12నియోజకవర్గాలలో కనీసం మహాకూటమి ఒక్క స్థానం కూడా టీడీపీకి కేటాయించలేదని ఆయన మాట్లాడారు. దీని వలన జరగబోయే ఎన్నికల్లో ఓట్ల బదిలీ జరిగే అవకాశాలు లేకుండా పోతాయన్నారు. తుంగతుర్తి టికెట్‌ను టీడీపీకి కేటాయించాలని పార్టీ జాతీయఅధ్యక్షుడు చంద్రబాబునాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. . టికెట్‌ కేటాయించకుంటే ఈయన కూడా రెబెల్ గా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.తె మొత్తానికి టీడీపీ ఇప్పుడు రెబల్స్ తో తల్లడిల్లుతుంది. నామినేషన్ల పర్వం ముగిసే సరికి ఎందరు నామినేషన్లు వేస్తారో ఎందరు పార్టీ ఆదేశాల మేరకు ఉపసంహరించుకుంటారో చూడాలి.

Mahakutami TDP Party news , Rebels Given shock news to TDP party , muvva satyanarayana from Sherilingampalli ,  mallaaiah yadav from kodada , bandru shobharani from aleru 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *