మ‌మ్ముట్టి ఈగోనే కార‌ణ‌మా?

Mammootty Yatra Movie
మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `యాత్ర‌`. వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేసిన పాద‌యాత్ర ఆధారంగానే ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మ‌హి వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో న‌టించ‌మ‌ని మమ్ముట్టిని అడ‌గ‌టానికి వెళ్లిన‌ప్పుడు ఆయ‌న మ‌రే పెద్ద స్టార్ న‌టించ‌క‌పోతేనే తాను న‌టిస్తాన‌ని అన్నాడ‌ట‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌కు మమ్ముట్టి అయితే ప‌క్కాగా సూట్ అవుతాడ‌ని భావించిన మ‌హి వి.రాఘ‌వ్ ముందు స‌రేన‌ని అన్నారు. త‌ర్వాత మ‌మ్ముట్టిని ఒప్పించి వేరే స్టార్‌ను న‌టింప చేయ‌వ‌చ్చున‌నేది ఆయ‌న ఆలోచ‌న‌. ముందుగా వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో సూర్య లేదా కార్తి, విజ‌య్‌దేవ‌ర‌కొండ ఇలా చాలా యంగ్ హీరోల పేర్లు అనుకున్నారు. కానీ మ‌మ్ముట్టి ఒప్పుకోలేదట‌. ఒక‌వేళ వాళ్లు ఎంట్రీ అయితే తాను ప్రాజెక్ట్ నుండి బ‌య‌ట‌కు వెళ్లిపోతాన‌ని చెప్పార‌ట‌. దాంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు ఏమీ చేయ‌లేకపోయారు. తీరా సినిమా అంతా పూర్తి కావ‌చ్చింది. సినిమా అనౌన్స్‌మెంట్ రోజు ఉన్న అంచ‌నాలు ప్ర‌స్తుతం లేవు. మమ్ముట్టిని బేస్ చేసుకుని బిజినెస్ చేయ‌డం క‌ష్ట‌మే. మ‌రో స్టార్ ఉండుంటే ఇంకా బావుండేది క‌దా!అని యూనిట్ అనుకుంటుందట‌. మ‌మ్ముట్టి ఈగో కార‌ణంగానే యాత్ర సినిమాపై అంచ‌నాలు త‌గ్గుతున్నాయ‌నేది ఓవ‌ర్గం వాద‌న‌. ఈ చిత్రం డిసెంబ‌ర్ 21న విడుద‌ల‌వుతుంది.

Mammootty , Mammootty Yatra Movie  , Super star Mammootty , The movie ‘Yatra’ is playing the role of chief minister YS Rajasekhara Reddy, Yatra Movie News.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *