మోడీ చేసిన నోట్ల రద్దు గాయాలు మానలేదు

Manmohan Singh News

పీఎం గా పని చేసిన కాలంలోనూ పెద్దగామాట్లాడని మన్మోహన్ సింగ్ నోరు విప్పారు. మోడీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకుని నేటికి రెండేళ్ళ కాలమైనా గాయాలు మాత్రం అలాగే ఉన్నాయన్న మన్మోహన్ దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్దనోట్ల రద్దుతో తగిలిన గాయాలు కాలంతో పాటు పెరిగి వికృతంగా కనిపిస్తున్నాయని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 నవంబర్‌ 8న తీసుకున్న దురాలోచన, దురదృష్టకరమైన నిర్ణయం అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో నోట్ల రద్దు వల్ల భారతీయ ఆర్థిక వ్యవస్థపై, సమాజంపై చూపిన వ్యతిరేక ప్రభావం ఈరోజుకీ కనిపిస్తోందన్నారు. అన్నింటినీ కాలమే మాన్పుతుందని చెబుతుంటారు. పెద్దనోట్ల రద్దు వల్ల ఏర్పడిన మచ్చలు, గాయాలు మాత్రం దురదృష్టవశాత్తూ… కాలంతో పాటు మరింతగా పెరుగుతూ వికృతంగా కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు .
దేశంలోని ప్రతి ఒక్కరిపైనా పెద్దనోట్ల రద్దు ప్రభావం కనిపించిందన్న ఆయన
జీడీపీ దారుణంగా పడిపోయిందని ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెద్దనోట్ల రద్దు షాక్‌ నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోయాయి అని చెప్పారు. ఆర్థిక మార్కెట్లు దుర్బలంగా మారాయని ఉపాధిపై దీని ప్రభావం ప్రత్యక్షంగా పడిందని తెలిపారు. మౌలిక వసతుల ప్రాజెక్టుల రుణ దాతల్ని, నాన్‌ బ్యాంకింగ్‌ ఆర్థిక వ్యవస్థల వనరులను ఆవిరి చేసింది.రూపాయి మారక విలువ తగ్గిపోయింది. ప్రపంచ చమురు ధరలు పెరుగుతున్నాయి. స్థూల ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా కుప్పకూలే పరిస్థితి వచ్చింది. దీని ప్రభావాన్ని మనం ఇంకా పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాల్సి ఉందన్న ఆయన ఇది దేశానికి చాలా నష్టదాయకమైన నిర్ణయం అని చెప్పారు.
స్వల్పకాలిక చర్యలపై ఆధారపడకపోవడం చాలా మంచిదన్న మన్మోహన్ సంప్రదాయ విరుద్ధమైన చర్యల జోలికి పోకుండా ఉండాలని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్థిక విధానాల్లో నిర్దిష్టత, స్పష్టతను పునరుద్ధరించాలని,ఆర్థిక దుస్సాహస చర్యలను, అనాలోచిత ఆర్థిక విధానాలను అమలుచేస్తే వాటి ప్రభావం దీర్ఘకాలంలో దేశంపై ఎలా ఉంటుందోనన్న సత్యాన్ని ఈ రోజు గుర్తుచేస్తుంది’ అని మన్మోహన్‌ పేర్కొన్నారు. ‘ఎలాంటి గాయాన్నైనా మాన్పించే శక్తి కాలానికి ఉందంటారు. కానీ, నోట్ల రద్దు అలా కాదు. కాలం గడిచేకొద్దీ ఆ గాయం మరింత స్పష్టంగా కనపడుతుంది.’ అని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. మొత్తానికి మోడీ తీసుకున్న నిర్ణయం దేశ ఆర్ధిక వ్యవస్థను ఏ విధంగా కుదేలు చేసింది చెప్పి మన్మోహన్ మోడీ ప్రభుత్వ విధానాలు అనుసరణీయం కానివని చెప్పారు.

Manmohan Singh News, Telugu news Update, Telugu Latest News, News On Modi ,tsnews.tv , Telugu Update News, Big Notes News,

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *