మారుతీ ధరలకు రెక్కలు

Maruti Suzuki hikes prices of cars

రూపాయి పతనమేకారణం. తమ వాహనాలపై ధరలను పెంచిన మారుతీ సుజుకి. వివిధ మోడళ్ళపై 6,100 రూపాయల వరకు ధరల పెంపు. ఉత్పత్తి,రవాణా వ్యయం పెరగటం,రూపాయి విలువ పతనం కారణం. వస్తువుల ధరలు, పంపిణీ వ్యయాలు పెరగటం, విదేశీమారకంలో రూపాయి విలువ పతనం కావటం వంటి అంశాల ప్రభావం ఆటోమొబైల్స్ రంగంపై పడింది. దేశంలోనే అతిపెద్ద వాహన తయారీదారు మారుతీ సుజుకి తన ధరల పెంపును ప్రకటించింది. తమ కంపెనీ తయారు చేస్తున్న అన్ని మోడళ్ళపైనా వాహనాల ధరలను గరిష్టంగా పెంచింది. 6,100 రూపాయల వరకు ధరల పెంపు ఉంటుందని మారుతీ సుజుకీ  తెలిపింది. ఈ ధరల పెంపు ఆగష్టు నెల నుండే (ఇప్పటినుండే ) అమలులోకి వస్తుందని తెలిపింది. ఉత్పత్తి ఖర్చులు, రవాణా వ్యయం పెరగటంతో ఒక్క మారుతి సుజుకీనే కాకుండా ప్రముఖ అన్ని వాహన తయారీ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. వ్యయం తగ్గించుకుని లాభాల బాటలో నడవాలంటే ధరలు పెంచటం తప్పని సరిగా మారిందని అందుకు రూపాయి విలువ పడిపోవటం కూడా ఒక కారణం అని చెప్తున్నాయి వాహనాల తయారీలో దిగ్గజ కంపెనీలైన మారుతి,మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా మరియు  టాటా మోటార్స్‌ కంపెనీలు. ఇప్పటికే ఈ కంపెనీలు తమ ధరలను పెంచగా తాజాగా మారుతీ సుజుకీ తన ధరలను ప్రకటించింది.

Suzuki hikes prices of cars, Maruti Suzuki hikes prices, Maruti Suzuki Cars Price Updates,Indian Rupee Value Low, Maruti Suzuki Updates,Telugu Latest News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *