గడ్డంకు లైన్ క్లియ‌ర్

Minister Gaddam Vidodh

ఢిల్లీలో ఉన్న ఆయ‌న‌కు స‌డెన్ గా కేసీఆర్ నుంచి పిలుపువ‌చ్చింది
ఇక్క‌డ‌కు వ‌చ్చీ రాగానే ఆయ‌న‌కు ఊహించ‌ని వ‌రం ద‌క్కింది
దీంతో పోటీ చేయాల‌న్న ఆలోచ‌న‌ను అటుంచి ప్ర‌చారానికి సై అంటున్నారు
మాజీ మంత్రి గ‌డ్డం వినోద్ .. త‌మ పార్టీ కి వ‌స్తార‌ని గంపెడాశ‌ల్లో ఉన్న కాంగ్రెస్ కు ఇది ఓ ర‌కంగా షాకే

టీఆర్ ఎస్ బాస్ కేసీఆర్ మాజీ మంత్రి గ‌డ్డం వినోద్ కు లైన్ క్లియ‌ర్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నార‌న్న ఊహ‌గానాలు వెల్లువెత్తిన నేప‌థ్యంలో ఆయ‌న చేప‌ట్టిన దిద్దుబాటు చర్య‌లు సత్ఫ‌లితాలు ఇచ్చిన‌ట్లే ఉంది.దీంతో ఆయ‌న ప్ర‌చారంలోకి వెళ్ల‌నున్నార‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చెన్నూరు నుంచి పోటీచేయాల‌ని టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ ఆయ‌న పార్టీ ఫిరాయించేందుకు ఢిల్లీ వెళ్లి హ‌స్తం పార్టీ పెద్ద‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపారు.
దీంతో విష‌యం తెల్సుకున్న కేసీఆర్ ఆయ‌న వెనువెంట‌నే హైద్రాబాద్ కు ర‌ప్పించారు. కేటీఆర్ తో స‌మావేశ‌మైన ఆయ‌కు గులాబీ గూటి నుంచి స్ప‌ష్ట‌మైన హామీ వ‌చ్చింది.దీంతో ఆయ‌న వెన‌క్కు త‌గ్గారు. త్వ‌ర‌లో పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసేందుకు చెన్నూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజక వర్గాలకు వెళ్ల‌నున్నార‌నని తెలుస్తోంది.

Ex Minister Gaddam Vidodh , Line Clear to Vinodh  , Telugu Latest News , telugu News, Chennuru Latest news, KCR news update, TRS Political News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *