వైసీపీ ఎమ్మెల్యే బాలయ్యకు క్షమాపణ చెప్పింది అందుకేనా

MLA Anil Kumar yadav

జగన్ పై దాడి జరిగిన నేపధ్యంలో ఏపీలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. జగన్ పై దాడి పై స్పందించిన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్ బాలయ్యపై చాలా అసభ్యంగా మాట్లాడారు. వ్యక్తిగత విమర్శలు చేశారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఆయ‌న అభిమానుల‌కు సారీ చెప్పారు. ఇటీవ‌ల జ‌గ‌న్‌పై దాడి నేప‌థ్యంలో ఆయ‌న బాల‌కృష్ణ‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు.
మానసిక స్థితి బాగా లేదంటూ ఆసుపత్రిలో సర్టిఫికెట్ తెచ్చుకుని ఒక కేసు నుంచి బయట పడిన బాలకృష్ణకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత ఉందా? బాలకృష్ణ కార్యక్రమానికి వెళ్ల‌డమే పాపంలాగా ఆయ‌న అభిమానుల‌ను కొడుతుంటాడు అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుని అనిల్‌కుమార్ త‌న‌ను క్ష‌మించ‌మ‌ని కోరారు.జ‌గ‌న్ మాకు లీడ‌ర్ మాత్ర‌మే కాదు, మాకు స‌ర్వ‌స్వం. అందుకే ఆయ‌న‌పై దాడి జ‌రిగిన ఎమోష‌న్లో అలా మాట్లాడాను. టీడీపీ నాయకులపై నేను త‌ప్పు మాట‌లు మాట్లాడాను. ఆ మాటలతో బాధపడిన టీడీపీ నాయకులు, కార్యకర్తల‌ను క్షమాపణ కోరుతున్నాను అని అనిల్‌కుమార్ అన్నారు. నెల్లూరులో జ‌రిగిన రాజన్న కంటి వెలుగు కంటివైద్య శిబిరం కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఆయ‌న ఈ విధంగా క్ష‌మాప‌ణ కోరారు. భావోద్వేగంలో అలా మాట్లాడాను, అయినా కూడా అది పొర‌పాటేన‌ని అనిల్‌కుమార్‌ యాదవ్‌ అంగీకరించారు.
అయితే, ఆయ‌న సారీ చెప్ప‌డానికి కార‌ణం ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో భారీ సంఖ్య‌లో బాల‌య్య ఫ్యాన్స్ ఉన్నారు. బాల‌య్య అభిమానులు టీడీపీలోనే కాదు, వైసీపీలో కూడా ఉన్నారు. ఇది త‌న‌కు రాబోయే ఎన్నిక‌ల్లో న‌ష్టం చేస్తుందేమో అనే ఉద్దేశంతో ఆయ‌న వ్యూహాత్మ‌కంగా సారీ చెప్పి ఉంటార‌ని తెలుస్తోంది.

MLA Anil Kumar yadav , Jagan Attack news, Anil kumar Yadav, MLA of Nellore district spoke very vulgarly on Balayya ,The MLA Anil Kumar yadav apologized to Balayya , Nellore Latest News, Telugu News,

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *