రూ.1149కే మోటరోలా ఒన్ పవర్

Moto One Power is Selling for Rs 1149

  • డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో ఈ ధరకే పొందే అవకాశం
  • ఫ్లిప్ కార్ట్  బిగ్ బిలియన్ డే సేల్ లో ఆఫర్

ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీ మోటరోలా నుంచి వచ్చిన వన్ పవర్ స్మార్ట్ ఫోన్ ను రూ.1149కే అందజేసేలా ప్రముఖ ఆన్ లైన్ స్టోర ఫ్లిప్ కార్ట్ అవకాశం కల్పించింది. ధర తగ్గింపుతోపాటు బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ తర్వాత కనిష్టంగా ఇంత మొత్తానికే ఈ ఖరీదైన ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. గురువారం నుంచి మూడు రోజులపాటు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ నిర్వహిస్తోంది. సేల్ లో భాగంగా పలు ఉత్పత్తులపై భారీగా రాయితీలు అందించింది. ఈ నేపథ్యంలో మోటరాలో వన్ పవర్ ధర కూడా తగ్గింది. వాస్తవానికి వన్ పవర్ ధర రూ.15,999 కాగా, బిగ్ బిలియన్ డే సేల్ లో భాగంగా ఈ ఫోన్ ధరను ఏకమొత్తంగా రూ.1000 తగ్గించడంతో ప్రస్తుతం ఇది రూ.14,999కి లభిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో భాగంగా మీ పాత స్మార్ట్ ఫోన్ ను బట్టి రూ.500 నుంచి రూ.13,850 వరకు రాయితీ వస్తుంది. అంటే రూ.1149కే ఫొన్ వస్తుందన్నమాట. దీనికి అదనంగా హెచ్ డీ ఎఫ్ సీ కార్డుతో కొనుగోలు చేస్తే తక్షణమే 10 శాతం రాయితీ లభిస్తుంది. అంటే అసలు ఏమీ చెల్లించకుండా కూడా ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. అయితే, అది మీరు ఎక్స్చేంజ్ చేసే స్మార్ట్ ఫోన్ పై ఆధారపడి ఉంటుంది. ఒక మోటరోలా వన్ పవర్ ఫీచర్లను పరిశీలిస్తే.. ది 6.2 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేతో వస్తుంది. స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్, ఆండ్రాయడ్ పై ఆపరేటింగ్ సిస్టమ్, 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉన్నాయి. 16 మెగాపిక్సల్, 5 మెగాపిక్సల్ సామర్థ్యంతో డ్యూయల్ రియర్ కెమెరా, ముందువైపు 12 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు.

Buy Moto One Power For Lowest price Click Here

Buy latest Nokia Phones Here>>

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *