సుహాసినికి అండగా నందమూరి హీరోలు

Nandamuri Suhasini Political updates

· తమ సోదరిని గెలిపించాలని జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వినతి

· అన్న కూతురి తరఫున ప్రచారం చేయనున్న బాలకృష్ణ
కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి నందమూరి హీరోలు అండగా నిలిచారు. తమ సోదరిని భారీ మెజార్టీతో గెలిపించాలని జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు అభిమానులను కోరారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ప్రకటన విడుదల చేశారు. కాగా, తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న సుహాసిని.. తాత ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణలకు నివాళులర్పించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. తండ్రి సమాధి వద్దే నామినేషన్‌ పత్రాలపై సంతకం చేశారు. కుటుంబ సభ్యులు, నందమూరి బాలకృష్ణలతో తొలుత ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లిన ఆమె.. అనంతరం మహాప్రస్థానంలోని తన తండ్రి సమాధి దగ్గరకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుహాసిని మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌, హరికృ‍ష్ణ, బాలకృష్ణ, చంద్రబాబుల స్పూర్తితో రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఉదయం 11.21నిమిషాలకు నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. నందమూరి ఆడపడుచు సుహాసిని గెలుపు కోసం యువత, అభిమానులు, కార్యకర్తలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. తమ ఆశయాలను సుహాసిని ముందుకు తీసుకెళ్తారని పేర్కొన్నారు. సుహాసిని కోసం ప్రచారం చేస్తానన్నారు. అలాగే మహాకూటమి తరపున కూడా ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. ఈ నెల 26 నుంచి ప్రచారం ప్రారంభిస్తానని వెల్లడించారు.


Nandamuri Suhasini Political updates , Balakrishna is going to be campaigning for Suhasini , Kukatpalli update TDP party news, JRNTR, Kalyan ram 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *