టీఆర్ఎస్ అభ్యర్థికి తన నిర్ణయంతో షాక్ ఇచ్చిన నందమూరి సుహాసిని

Nandamuri Suhasini who shocked her decision on the TRS candidate

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్ధిగా కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి నందమూరి కుటుంబం నుండి సుహాసిని ఎన్నికల బరిలోకి దిగారు. మ‌హాకూట‌మి త‌రపున ఇప్ప‌టికే నామినేష‌న్ వేసిన దివంగ‌త నంద‌మూరి హ‌రికృష్ణ కుమార్తె నంద‌మూరి సుహాసిని ప్రచారం ప్రారంభించారు. సమయం తక్కువ ఉన్న నేపధ్యంలో మ‌రింత వేగాన్ని పెంచారు. ఎన్నిక‌ల పొలింగ్‌కు ఇంకా కొద్ది రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌టంతో కూక‌ట్ ప‌ల్లిలో గెలుపే లక్ష్యంగా ఆమె క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. అయితే తనను నాన్ లోకల్ అని ప్రచారం చేస్తున్న వారి దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టే పని లో ఉన్నారు.
కూక‌ట్ ప‌ల్లికి చెందిన టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశ‌మ‌వుతూ తన గెలుపు కోసం పని చెయ్యాలని కోరుతున్నారు . ఎన్నిక‌ల్లో గెలుపొందేందుకు కూటమి శ్రేణులన్నీ క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని ఆమె అడుగుతున్నారు.ఇప్ప‌టికే ఆమె నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌తో వ‌రుసగా భేటీలు నిర్వ‌హించిన ఆమె ప్రచార వ్యూహం పై ప్రత్యర్ధిని ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్ర‌మంలో నంద‌మూరి సుహాసిని కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. రాజ‌కీయాలు త‌నకు కొత్త కాద‌ని, సుదీర్ఘ రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న కుటుంబం నుంచి తాను వ‌చ్చాన‌ని చెప్పిన సుహాసిని త్వ‌ర‌లోనే నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర నిర్వ‌హించనున్న‌ట్లు ఆమె సంచలన ప్రకటన చేశారు. నియోజకవర్గం మొత్తం పాద‌యాత్ర చేస్తాన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల స‌మస్య‌లు తెలుసుకోవ‌డంతో పాటు ప్ర‌జ‌ల‌కు చేరువయ్యేందుకు గాను పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సుహాసిని చెప్పారు. ప్ర‌జల వద్దకు వెళ్లి మరిన్ని సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానన్నారు సుహాసిని.
కొంత‌మంది నాన్ లోక‌ల్ అని ప్ర‌చారం చేస్తున్నార‌ని, అలాంటి వాళ్లకు తాను ఇక్కడే పదో తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్నాన‌ని సుహాసిని స‌మాధాన‌మిచ్చారు. కొంత‌మందికి ఈ విష‌యం తెలియ‌క తనను నాన్ లోకల్ అంటే సరిపోతుందా అని కౌంటర్ ఇచ్చారు . తన కోసం కుటుంబ స‌భ్యులంద‌రూ ప్ర‌చారం నిర్వ‌హిస్తార‌ని చెప్పిన సుహాసిని, కూక‌ట్ ప‌ల్లిలో విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. సినిమాల షెడ్యూల్‌ చూసుకుని బాలకృష్ణతోపాటు కల్యాణ్‌ రామ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ప్రచారంలో పాల్గొంటారని ఆమె క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ప్రత్యర్ధి పార్టీ కి నోటి మాట రాకుండా సమాధానం చెప్పిన సుహాసిని సంచలన నిర్ణయం తీసుకుని గులాబీ అభ్యర్థికి షాక్ ఇచ్చారు .

Nandamuri Suhasini who shocked her decision on the TRS candidate , Suhasini Given shock news to TRS candidate , Kukatpalli update news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *