నారా వారి శ్రీ‌మంతుడు

Nara Lokesh
తిత్లీ తుఫాను గాయాల నుంచి కోలుకునేలా ప్ర‌భుత్వం నిన్న‌టి వేళ ప‌రిహారం అందించింది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా ఆయ‌న త‌న‌యుడు పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా చెక్కుల‌ను పంపిణీ చేసి, తమ క‌ర్త‌వ్యం ఇంత‌టితో తీరిపోలేద‌ని, ముందున్న కాలంలో ఈ ప్రాంతం కోలుకునేదాకా తాము ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటామ‌ని తండ్రీ త‌న‌యులు ఇద్ద‌రూ హామీ ఇచ్చారు. నారా లోకేశ్ మ‌రో ముందుకు వేసి మంద‌స మండ‌లాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించి, అందరిలోనూ ఆనందోత్సాహాలు నింపారు.ఈ సంద‌ర్భంగా మంద‌స ప్రాంతం ప‌ర్య‌టించి,
నాటి తుఫాను విల‌యం నుంచి బాధితులు కోలుకునేలా శ్రీ‌కాకుళం యూత్ ఫోర్స్ ప్ర‌తినిధిగా నిత్యావ‌స‌ర స‌ర‌కులు అందించివ‌చ్చిన వైనం గుర్తుకువ‌స్తోంది. నాడు రాక్ష‌స గాలుల కార‌ణంగా ఎన్నో కుటుంబాలు దిక్కులేకుండా పోయాయి. ఎన్నో కుటుంబాలు నిలువ నీడ లేకుండా పోయాయి. త‌ల్లీ బిడ్డ అంతా పున‌రావాసం కోరి పాఠ‌శాల‌ల్లో త‌ల‌దాచుకున్న ఘ‌ట‌న‌లు ఇప్ప‌టికీ గుర్తు. వారికి అన్నం నీరు అంద‌క అవ‌స్థ ప‌డిన రోజులు గురించి తెల్సుకున్న వైనం ఎన్న‌టికీ మ‌రువలేం. క‌ళ్లెదుటే ఇళ్ల పై క‌ప్పులు ఎగిరిపోతున్నా.. క‌ళ్లెదుటే బువ్వ ఇచ్చే చెట్ల‌న్నీ నేల కూలుతున్నా ఆ నిస్స‌హాయ‌తతో విల‌యాన్ని ఎదుర్కోలేని ద‌య‌నీయ‌త, అచేత‌న‌త వారిది.ఇలాంటి వారిని ఆదుకునేందుకు కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు ముందుకువ‌చ్చాయి. ఇదే సంద‌ర్భాన ఇవాళ మంత్రి లోకేశ్ మంద‌స‌ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని, ఉద్దానానికి పూర్వ వైభ‌వం తెస్తాన‌ని చెప్ప‌డం ఓ విధంగా ఆహ్వానించ‌ద‌గ్గ‌దే.. అందుకు త‌గ్గ ప్ర‌య‌త్నం ప్ర‌ణాళిక త‌క్ష‌ణం అమ‌లుకు నోచుకుంటే మేలు.

తిత్లీ తుఫాను.. ప‌చ్చంద‌నాల‌కు ఆ విల‌యం ఓ ఉరి..చెట్టంత కొడుకు కు నీడ చాటు మృత్యు మేఖ‌ల.. నీడ మృత్య‌వు నిజం మృత్యువు మిగిల్చిన విషాదం. నిజాల‌ను నీడల‌ను న‌మ్మక మూడు వారాలు.నిజాల‌ను నీడ‌ల‌ను తోడ్కొని సం చారం చేయ‌క మూడు వారాలు.గాయం రేగితే దుఃఖం.. దుఃఖం రేగితే వియో గం.నేల త‌ల్లికి ప‌సుపు కుంకుమ‌లిచ్చు సంబ‌రం లేదిప్పుడు.గిరి గూడ‌ల్లో వెలి గి ఆరే దీపాలంటే వెన్నెల‌కూ చిన్న‌చూపే!అటువంటి స‌మ‌యాన హృద‌య‌విదార‌క గోడుని వింటున్న ప్ర‌జాప్ర‌తినిధులు ఒక్కొక్క‌రుగా మేమున్నాం అని త‌ర‌లివ‌స్తే క‌ద‌లి వ‌స్తే వ‌ర్త‌మాన ద‌య‌నీయ‌త త‌ప్ప‌క దూరం అవుతుంది.

ఇప్పుడిక ఓ విధ్వంసం
ప‌లాయ‌నం చిత్త‌గించ‌ద‌ని తెల్సు
ఇప్పుడిక ఓ విల‌యం
విస్తృతికి నోచుకోద‌ని తెల్సు
తిత్లీ తుఫాను నేల‌పై మృత్యురాత
కాదు నేల‌కు మృత్యురాత‌..
ఆ రాత‌ను మార్చాలి..
బ‌తుకుల‌కు పూర్వపు వెలుగులు అందించాలి
అందుకు ఈ దివ్వెల పండుగ నాంది కావాలి

వాక్యంగాఆవృతం అయిన దుఃఖం ఇది… పెన‌వేసుకున్న సంవాదం ఇది. గాలి చిత్తాల‌కు మొక్క‌రిల్ల‌డం తెలియ‌ని ప‌ని. కానీ చేయాల్సివ‌చ్చింది. తిత్లీ తుఫా ను గాలి చిత్తాల‌నే కాదు ప్ర‌భుత ఏం చేయాలో కూడా వివ‌రించిపోయింది.దేవుడు మ‌నిషికి మ‌నిషికి మ‌ధ్య ఎడ‌తెగ‌ని బంధాన్ని తెంపి పారేస్తాడా.. తెలియదు.కానీ ఏదేమైనా మొక్క‌వోని ఆత్మ‌విశ్వాసం, సుదృఢ చిత్తం ద‌గ్గ‌ర ప్ర‌కృతి చేసిన గాయాలు త‌ప్ప‌క మానిపోతాయి. మంత్రి లోకేశ్ తో స‌హా మ‌రికొంద‌రు రేప‌టి వేళ వీరికి చేయూత‌నిస్తే త‌ప్ప‌క ఈ ప్రాంతాన తిరిగి ప‌చ్చంద‌నాలు పురుడుపోసుకుంటాయి.గిరిగూడ‌లు
నిన్న‌టి క‌ష్టాన్ని మ‌రిచిపోతాయి. ఆ దిశ‌గా ఈ దీపావ‌ళి అంద‌రినీ మున్ముందుకు న‌డిపించాల‌న్న‌ది మా అందరి ఆశ… వెలుగుతున్న అక్ష‌ర దీప‌కాంతుల‌ను తోడుగా చేసుకుని ఓ నా ప్రియ జ‌నులారా ఈ చీక‌టిని త‌రిమికొట్టండి.. నారా లోకేశ్ గారూ ఆల్ ద బెస్ట్.. హ్యాపీ దివాలీ టు ఆల్.

Nara Lokesh, Nara Lokesh latest news on titli toofan, Panchayati Raj Minister Nara Lokesh also distributed checks, AP latest News , Telugu News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *