పవన్ పై నారా లోకేష్ ఫైర్

Nara Lokesh

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు మంత్రి నారా లోకేష్. పదవికోసమే పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ప్రధాని నరేంద్రమోదీ దత్తపుత్రుడు అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అవినీతి జరిగిందంటూ గగ్గోలు పెడుతున్న పవన్ వాటిని నిరూపించమంటే ప్యాకప్ అన్నారని విమర్శించారు.
మరోసారి బాక్సైట్ పై మసిపూసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం మాని ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. మరోవైపు మోడీ ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసారంటూ పవన్ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ ఏదని ప్రశ్నించారు. నివేదిక ఇచ్చినా ఎందుకు ప్రశ్నించడం లేదని ట్విట్టర్ వేదికగా నిలదీశారు.

Lokesh Comments on Pavan, Nara Lokesh Fire On Pavan Kalyan, Lokesh Comments on Pavan in Tweeter, AP Political News, Telugu news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *