కుప్పకూలిన ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు 

NBFC shares collapsed

ఐఎల్‌అండ్ఎఫ్‌ఎస్‌ కంపెనీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో మొదలైన ఫైనాన్స్ కంపెనీల అమ్మకాల హోరు ఇవాళ స్టాక్‌ మార్కెట్‌ను గడగడలాడించింది. ప్రపంచ మార్కెట్లన్నీ లాభాల్లో ఉండగా మన మార్కెట్లు కూడా లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 11346 పాయింట్ల గరిష్థ స్థాయిలో ఉన్న నిఫ్టి ఏకంగా 500 పాయింట్ల దాకా నష్టపోయి 10866కి చేరింది. తరవాత కోలుకుని ఇపుడు 11140 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ ఒకదశలో 1500 పాయింట్లు క్షీణించి ఇపుడు 36932 వద్ద ట్రేడవుతోంది. మొదట్లో కేవలం ఎస్‌ బ్యాంక్‌కు మాత్రమే పరిమితమైన అమ్మకాల హోరు వెంటనే నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సింగ్‌ కంపెనీలకు మారింది. కంపెనీ బాండ్లపై ఈల్డ్ అనూహ్యంగా పెరగడంతో బాండ్ల విలువ కరిగిపోతోంది.    ముఖ్యంగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీకి చెందిన బాండ్లను అమ్మాలని డీఎస్‌పీ కంపెనీ ప్రయత్నించడంతో ఈ సంక్షోభం మొదలైంది.  డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన బాండ్లను మార్కెట్‌ ఎవరూ కొనడం లేదనే వార్త.. ఆ షేర్‌ను కుంగదీసింది. తొలుత 10 శాతం తరవాత 20 శాతం క్షీణించిన ఈ షేర్‌కు 25 శాతం వద్ద ట్రేడింగ్‌ కొద్దిసేపు ఆపారు.. అయినా ఫలితం లేకపోయింది. సీలింగ్‌ తొలగించిన కొన్ని క్షణాల్లోనే షేర్‌ 30 శాతం క్షీణించింది. ఈ దెబ్బతో ఇతర ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. బజాజ్‌ ఫైనాన్స్‌ వంటి అద్భుత పనితీరు ఉన్న కంపెనీ షేర్‌ కూడా అయిదు శాతం క్షీణించింది. ఇదే సమయంలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ షేర్‌ కూడా 30 శాతం దాకా పడిపోయింది. ఇక బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌ షేర్‌  8 శాతం  క్షీణించింది. ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలతో లింకు ఉన్న రియాల్టి కంపెనీల షేర్లలో కూడా అమ్మకాల జోరు పెరిగింది.  ఇండియా బుల్స్ గ్రూప్‌కు చెందిన ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్‌ ఏకంగా 16 శాతం క్షీణించగా, గోద్రెజ్ ప్రాపర్టీస్‌ 6 శాతం క్షీణించింది. ఇక హెచ్‌డీఐఎల్‌ కంపెనీ షేర్లు 7 శాతం తగ్గాయి. మొత్తం మీద నిఫ్టి రియాల్టి సూచీ 4.5 శాతం పడిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇక హౌసింగ్ ఫైనాన్స్‌ రంగంలో ఉన్న రిలయన్స్‌ హోమ్‌ 11 శాతం, గృహ్‌ ఫైనాన్స్‌ 13 శాతం, రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ 8 శాతం క్షీణించగా, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 5 శాతం, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 4 శాతం పడింది.

NBFC shares collapsed,to day share market updates,Share Market Live,Sensex,Indian stock markets (Sensex and Nifty) ,shares collapsed,latest updates,to day telugu latest updates

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *