తెరాస న్యూ జీలాండ్ శాఖ

New Zealand compaign TRS

తెరాస న్యూ జీలాండ్ శాఖ – ఎన్నికల ప్రచారానికి సిద్ధం. నిన్న కెసిఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి తెరాస న్యూ జీలాండ్ శాఖ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ఆలాగే కెసిఆర్ గారు 105 స్థానాల అభ్యర్థుల ప్రకటన పైన తెరాస న్యూ జీలాండ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కొసన హర్షం వెలిబుచ్చారు. నిన్నటి ప్రకటన ప్రతిపక్షాలకు ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటిదని తెలిపారు. తెలంగాణ ప్రగతి కేవలం కెసిఆర్ గారి నాయకత్వంలోనే సాధ్యం, అని గత నాలుగు సంవత్సరాల సంక్షేమమే ఉదాహరణ. కెసిఆర్ గారి నాయకత్వ ప్రతిభతో 100 పైగా స్థానాల్లో విజయ దుందుభి తెరాస మోగిస్తుందని తెలిపారు. తెరాస Nri కో ఆర్డినేటర్ మహేష్ బిగాలా గారు కూడా తమకు త్వరలో ఎన్నికల ప్రచార నిర్వహణలో అవలంభించాల్సిన పద్దతుల గురించి వివరరిస్తారని తెలిపారు. అనంతరం తెరాస న్యూ జీలాండ్ శాఖ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యి ఎన్నికల ప్రచార కార్యాచరణ రూపొందించబోతున్నామని తెలిపారు . ఈ రోజు కెసిఆర్ గారికి సైనికులుగా పని చెయ్యాలనే ఉద్దశ్యంతో తెరాస న్యూ జీలాండ్ హొనొరర్య్ చైర్ పర్సన్ కళ్యాణ్ రావు కాసుగంటి “జై కెసిఆర్” రిజిస్ట్రేషన్ ప్లేట్ కలిగిన ,తన స్వంత కారును తెలంగాణ ప్రగతి రథముగా , న్యూ జీలాండ్ లోని రహదారుల పైన నడుపుతూ , అధ్యక్షుడు మరియు ఇతర కమిటీ సభ్యులతో కలిసి ఇంటిటీకి ప్రచారం నిర్వహించి , తెలంగాణ బిడ్డల మద్దతు పాటు , తెలంగాణ లో నివసించే అన్ని నియోజకవర్గాల వారి కుటుంబాల, స్నేహితుల మద్దతు పొంది తెరాస పార్టీ గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ రోజు శ్రావణ శుక్రవారం మంచి రోజు కావడం వలన ఈ ప్రచారానికి నాంది పలికామని అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కొసన తెలిపారు. అన్ని ప్రజా ఆశీర్వాద సభలను విజయవంతం కావాలని అభిలషించారు .

New Zealand compaign TRS, TRS Compaign At New Zealand,  International TRS, TRS Latest Updates, TS Political Updates, Telugu Political Updates, NRI Co-Ordintor Mahesh Bhigala, TRS Addressed New Zealand, Telugu Updates, Telugu Vaarthalu

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *