నోకియాకు రెస్సాన్స్ అదిరింది

Nokia 6.1 Plus Sold Out in Seconds

  • రెండు నిమిషాల్లోనే అమ్ముడైన 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్

మొబైల్ ఫోన్లలో నోకియా బ్రాండ్ అంటే ఒకప్పుడు పెద్ద సంచలనం. తర్వాత కాలంలో దాని ప్రాభవం తగ్గినా, మళ్లీ తాజాగా పుంజుకుంటోంది. ప్రస్తుతం మార్కెట్లో దూసుకెళ్తున్న చైనా దిగ్గజ కంపెనీ షావోమీకి నోకియా దీటుగా పోటీనిస్తోంది. అటు షావోమి స్మార్ట్ ఫోన్లు విడుదల చేసిన సెకన్లలోనే అమ్ముడవుతుండగా.. ఇటు నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్ ఫోన్లు కూడా అదే రేంజ్‌లో విక్రయాల్లో దూసుకెళ్తున్నాయి. తాజాగా నోకియా 6.1 ప్లస్‌ ఫ్లిప్ కార్ట్ లో ఫ్లాష్ సేల్ కు రాగా.. కేవలం రెండు నిమిషాల్లోనే మొత్తం ఫోన్లన్నీ అమ్మడై అవుటాఫ్ స్టాక్ బోర్డు దర్శనమిచ్చింది.  ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకానికి వచ్చిన ఈ ఫోన్‌, 12:02 కల్లా అవుటాఫ్‌ స్టాక్‌ అయిపోయింది. అయితే ఈ సేల్‌లో ఎన్ని యూనిట్లను విక్రయానికి ఉంచారో తెలియదు. నోకియా 6.1 ప్లస్‌కు ఇది మూడో సేల్‌. తొలి సేల్‌ ఆగస్టు 30న నిర్వహించారు. అప్పుడే వినియోగదారుల నుంచి ఈ ఫోన్‌కు మాంచి డిమాండ్‌ వచ్చింది. తొలి సేల్‌ వచ్చిన మూడు వారాల్లోనే ఫ్లిప్‌కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ కు వస్తున్న రేటింగ్స్‌, రివ్యూలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే 10,680రేటింగ్స్‌, 2,329 రివ్యూలు ఫ్లిప్ కార్ట్ లో రికార్డయ్యాయి. తర్వాత సేల్‌ సెప్టెంబర్‌ 20న మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది.  దీని ధర రూ.15,999.

నోకియా 6.1 ప్లస్‌ ఫీచర్లు…
5.8 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ వన్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌
గ్లాస్‌ శాండ్‌విచ్‌ డిజైన్‌ విత్‌ 2.5డీ గొర్రిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌
డ్యూయల్‌ సిమ్‌(నానో)
వెనుక వైపు రెండు కెమెరాలు(ఒకటి 16 మెగాపిక్సెల్‌, రెండోది 5 మెగాపిక్సెల్‌ సెన్సార్‌)
ముందు వైపు 16 మెగాపిక్సెల్‌ కెమెరా
4జీబీ ర్యామ్‌, 64జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
400 జీబీ వరకు ఎక్స్ పాండబుల్ మెమోరీ
3060 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Nokia 6.1 Plus Sale In Flipkar,Flipkart sold out of Nokia 6.1 Plus,Flipkart sold out of Nokia 6.1,Nokia 6.1 Plus Updates,Nokia 6.1 Plus Specifications,Nokia 6.1 Plus Features,Nokia 6.1 Plus Memory Detailes,Nokia 6.1 Plus,Mobile Market,Telugu Latets News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *