నోకియా నుంచి కొత్త ఫోన్ | Nokia 7.1 Specification

Nokia 7.1 Plus launch on Oct4th

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ నోకియా మరో కొత్త ఫోన్ తో వస్తోంది. చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం షావోమీకి ధీటుగా పోటీనిస్తూ.. పలు మోడళ్లతో మార్కెట్లోకి వస్తున్న నోకియా.. వచ్చేనెల ఓ కొత్త మోడల్ ను విడుదల చేయనుంది. లండన్  ఈ మేరకు మీడియాకు ఆహ్వానాలు కూడా పంపుతోంది. ‘నోకియా స్మార్ట్ ఫోన్ కుటుంబంలోకి చేరబోతున్న లేటెస్ట్‌ ఎడిషన్‌కు స్వాగతం చెప్పేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం‘ అని అందులో కంపెనీ పేర్కొంది. అయితే, ఏ ఫోన్ విడుదల చేస్తుందో, అందుకు సంబంధించిన వివరాలేవీ అందులో పేర్కొనలేదు. నోకియా 7.1 ప్లస్‌, నోకియా ఎక్స్‌7ను లాంచ్‌ చేసే అవకాశం ఉందని టెక్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. నోకియా ఎక్స్‌6(నోకియా 6.1 ప్లస్‌) మాదిరి చైనాలో ఈ ఫోన్‌ నోకియా ఎక్స్‌7(నోకియా 7.1 ప్లస్‌) పేరుతో మార్కెట్‌లోకి రాబోతుంది. నోకియా 7.1 ప్లస్‌ కూడా నోకియా 6.1 ప్లస్‌,  నోకియా 5.1 ప్లస్‌ మాదిరి ఎడ్జ్‌-టూ-ఎడ్జ్‌ నాచ్‌ డిస్‌ప్లే, ఆల్‌-గ్లాస్‌ డిజైన్‌తో రూపొందుతోంది. అయితే లీకైన కొన్ని ఇమేజ్‌ల్లో మాత్రం నోకియా 7.1 ప్లస్‌కు నాచ్‌ లేదని తెలుస్తోంది. ఇటీవల నోకియా 9 స్మార్ట్ ఫోన్ పై కూడా రూమర్లు వచ్చాయి. ఒకవేళ కుదిరితే ఈ ఫోన్ ను లాంచే చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు. మరి కొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Check Out the Nokia Mobile 7.1 Here

Nokia Latest Model Launch ,Nokia Upcoming Model,Nokia 7.1 Plus,Expected Mobile Of Nokia Launch in octber, mobile market updates,latest new mobile updates,nokia latest news,what model launch in nokia

 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *