ప్యూర్ డిస్ ప్లే ప్యానల్ తో నోకియా 7.1

Nokia 7.1 with Pure Disk Play Panel

· భారత మార్కెట్లోకి విడుదల

ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజం నోకియా నుంచి కొత్త ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. లండన్ లో గత నెలలో విడుదల చేసిన నోకియా 7.1 స్మార్ట్ ఫోన్ ని తాజాగా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. సోషల్ మీడియా లవర్లే లక్ష్యంగా ఈ స్మార్ట్ ఫోన్ రూపొందించింది. 5.84 అంగుళాల ప్యూర్ డిస్ ప్లే ప్యానల్ తో వీడియోలను మెరుగైన క్వాలిటీతోచూడొచ్చు. ఇంకా భారీ బ్యాటరీ బ్యాకప్, డ్యూయల్ కెమెరాలతో పాటు పలు ఆకట్టుకునే ఫీచర్లు ఇందులో ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. డిసెంబర్‌ 7నుంచి ఈ ఫోన్ ఆన్ లైన్ లో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ధర రూ.19,999. ఈ ఫోన్ ను హెచ్ డీఎఫ్ సీ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది.

నోకియా 7.1 ఫీచర్లు ఇవీ…
5.84 అంగుళాల ఫుల్ హెడ్ ప్లస్ డిస్‌ప్లే
1080 x 2280 పిక్సల్స్ రిజల్యూషన్‌
స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ పై
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
12+5 ఎంపీ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు
8 ఎంపీ సెల్పీ కెమెరా
3060 ఎంఏహెచ్ బ్యాటరీ

Nokia 7.1 with Pure Disk Play Panel , Nokia Latest Mobile, Nokia 7.1 , New smartphone in Nokia, Latest Mobile ,  Telugu news, Telugu Latest mobile

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *