5 కెమెరాలతో నోకియా ఫోన్? Nokia

Nokia X7 with 5 Cameras

  • త్వరలో ఎక్స్ 7 రిలీజ్

నోకియా నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది. మరిన్ని ఫీచర్లతో నోకియా ఎక్స్ సిరీస్ లో ఈ కొత్త ఫోన్ రానున్నట్టు తెలుస్తోంది. ఎక్స్‌ సిరీస్‌కు కొనసాగింపుగా ఎక్స్‌ 7త్వరలో భారత్‌ సహా ఇతర మార్కెట్లలో విడుదల కానుందనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనికి తోడు నోకియా తైవాన్‌ ఫేస్‌బుక్‌లో ఒక టీజర్‌ను రిలీజ్‌ చేయడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. అయితే ఆ పోస్టు చేసిన తర్వాత దానిని తొలగించడం గమనార్హం. ఆ పోస్టు ప్రకారం చూస్తే.. ఎక్స్ 7లో 5 రియర్ కెమెరాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు పలు ఇతర అద్భుత ఫీచర‍్లతో ఈ ఫోన్ అదిరిపోవడం ఖాయమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. 6 అంగుళాల ఫుల్ హెచ్ డీ స్క్రీన్, స్నాప్ డ్రాగన్ 710 సాక్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ లో ఇది లభ్యం కానుంది. గతంలో నోకియా ఎక్స్‌ 5, ఎక్స్‌ 6 లాంచింగ్‌ మాదిరిగానే ఎక్స్‌ 7, ఎక్స్‌ 7ప్లస్‌ను లాంచ్‌ చేయనున్నట్టు సమాచారం. అధికారికంగా ధర, ఇతర వివరాలపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేనప్పటికీ, దీని ధర సుమారు రూ. 20 వేలు ఉండొచ్చని అంచనా. అలాగే దీనిని ఈనెల 15న విడుదల చేసే అవకాశం ఉంది.

Check out the Price of Nokia Mobiles

5Cameras In Nokia X7,Nokia X7 Features,Nokia X7 Price,Nokia X7 Full Specifications,New Mobile Phones Updates,Latest Telugu Updates For Mobiles,Nokia New Model,Nokia X7 Specifications,Nokia X7 Latest Updates,Mobile Market,Telugu Latest Updates,Nokia X7 Model

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *