ఆ లిస్టులో స్వీటీ కూడా చేరింది…

NTR Biopic Movie
దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు` జ‌న‌వ‌రి 9న విడుద‌ల‌వుతుంది. ఇందులో ఎన్టీఆర్ అగ్ర క‌థానాయ‌కుడిగా ఎదిగిన వైనాన్ని చూపిస్తున్నారు. అందులో భాగంగా ఆయ‌న న‌టించిన అల‌నాటి అగ్ర తారామ‌ణులందరి పాత్ర‌ల్లో నేటి త‌రం హీరోయిన్స్ న‌టిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో అగ్ర క‌థానాయిక అనుష్క కూడా చేరింది. ఈమె సీనియ‌ర్ హీరోయిన్ బి.స‌రోజా దేవి పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ని స‌మాచారం. నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొన‌సాగింపుగా రాజ‌కీయ రంగ ప్ర‌వేశం.. అందులో ఆయ‌న సాధించిన విజ‌యాలు అన్ని `య‌న్.టి.ఆర్ మ‌హానాయ‌కుడు` పేరుతో జ‌న‌వ‌రి 24న విడుద‌ల కానుంది

Top heroine Anushka has joined the list , NTR Telugu Movie, NTR Biopic Movie, NTR Kathanayakudu Movie , Latest Telugu Movie 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *