సెప్టెంబ‌రు 20- అక్టోబ‌రు 6 వార‌ఫ‌లాలు

October First Week Panchangam

మేషరాశి: ఈవారం ముఖ్యమైన విషయాలపై దృష్ట్ని పెట్టుట మంచిది. ఉద్యోగంలో అధికారుల నుండి సహకారం లభిస్తుంది, కాకపోతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం పెద్దగా కలిసి రాకపోవచ్చును. సంతానం గురుంచి గతంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యపరమైన సమస్యలు తప్పక పోవచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. దూరప్రదేశంలో ఉన్న బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది అలాగే నూతన విషయాలు తెలుస్తాయి. నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది, అధిగమించే ప్రయత్నం మంచిది.

వృషభరాశి: ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది. గతంలో చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారంలో నూతన అవకాశాలు పొందుతారు, చిన్న చిన్న పెట్టుబడులు ప్రయత్నం చేయకుండానే లభిస్తాయి. మిత్రులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. ఉద్యోగంలో బాగాఉంటుంది , అధికారులతో కలిసి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. రుణపరమైన విషయాల్లో స్పష్ట అవసరం. కుటుంబంలో పెద్దలనుండి మీరు ఊహించని విధంగా సహకారం లభిస్తుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది.

మిథునరాశి:  ఈవారం ఆరంభంలో కాస్త ఇబ్బందులు తప్పక పోవచ్చును, ఉద్యోగంలో పనిఒత్తడిని కలిగి ఉంటారు. నలుగురిని కలుపుకొని వెళ్ళుట చేత పనులు సమయానికి పూర్తిచేయుటకు  అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకపోవడం అనేది సూచన. చిన్న చిన్న విషయాల వలన ఆందోళన చెందుతారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. బంధువుల కుటుంబంలో జరిగే కార్యక్రమాలకు హాజరు అయ్యే ఆస్కారం ఉంది. వాహనాల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. ప్రయాణాలు అనుకోకుండా చేస్తారు.

కర్కాటకరాశి: ఈవారం బంధువులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతనగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో మీ మొండి నిర్ణయాలు మీకు లబ్దిని కలుగజేస్తాయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విధ్యార్ధులకు బాగుంది. నూతన ఉద్యోగ అవకాశాలను పొందుతారు. గతంలో చేపట్టిన పనులకు కట్టుబడి ఉండవలసి వస్తుంది. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సంతానం విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. చర్చలకు సమాయం ఇస్తారు.

సింహరాశి: ఈవారం ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో పెట్టు బడుల కోసం చేసిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు విధానం తప్పక మేలుచేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో సొంత నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తారు. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుకుంటారు. రుణపరమైన విషయాల్లో ఇబ్బందులు తప్పక పోవచ్చును, మధ్యవర్తిత్వం పనికిరాదు. సంతానం విషయంలో మాత్రం కాస్త ఆందోళనకు గురయ్యే ఆస్కారం ఉంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు.

కన్యారాశి: ఈవారం చర్చలకు సమయం ఇవ్వడం వలన కాస్త నస్టపోయే ఆస్కారం ఉంది. సమయం విషయంలో జాగ్రత్త అవసరం. గట్టిగా ప్రయత్నం చేయుట వలన నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు. వారై సూచనల మేర ముందుకు వెళ్ళండి. దూరప్రదేశ ప్రయాణాలు చేయునపుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. సంతానం వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. గతంలో మీకు రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి.

తులారాశి: ఈవారం పెద్దలతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చేపట్టిన పనులను కాస్త జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళు ప్రయత్నం చేయుట మంచిది. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారి విషయాల్లో మీరు కొద్దిగా ఎమోషనల్ అవుతారు. వాహనాల వలన ఇబ్బందులు తప్పక పోవచ్చును. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలోచన చేయుట మంచిది.

వృశ్చికరాశి: ఈవారం పెద్దలతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయంలో నూతన అవకాశాలు పొందుతారు. జీవితభాగస్వామితో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ మాటతీరు విషయాల్లో కాస్త సరిచూసుకోవడం సూచన. మానసికంగా కొద్దిగా ఇబ్బందులు తప్పక పోవచ్చును. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. సోదరులతో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో స్పష్టమైన ప్రణాళిక చేసుకోవడం మంచిది.

ధనస్సురాశి: ఈవారం మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. ఉద్యోగంలో పెద్దల సూచనల మేర ముందుకు వెళ్ళండి. మీ మాటతీరు కొంతమందికి నచ్చక పోవచ్చును. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. సాధ్యమైనంత మేర చర్చలకు దూరంగా ఉండుట సూచన. సర్దుబాటు విధానం మంచిది.

మకరరాశి: ఈవారం సంతానపరమైన విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. నూతన వాహనాలను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త ఇబ్బందులు తప్పక పోవచ్చును. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. నూతన ఉద్యోగ అవకాశాలు లభించే ఆస్కారం ఉంది.

కుంభరాశి: ఈవారం వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయి. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. బంధువులను కలుస్తారు. మిత్రులతో చేపట్టు పనుల విషయంలో స్పష్టత అవసరం. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు, తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది.

మీనరాశి: ఈవారం సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుతుంది. ఆత్మీయులను కలుస్తారు, వారినుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం వలన మేలు జరుగుతుంది.

– డా. టి. శ్రీకాంత్, వాగ్దేవి జ్యోతిషాలయం
బి. టెక్ (మెకానికల్), ఎం.ఎ (జ్యోతిషం), ఎం. ఎ (వేదాంగజ్యోతిషం) మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం), (ఎమ్ ఎస్ సి (సైకాలజీ))
www.janmalagna.com
9989647466

Weekly Panchangam, Telugu Panchangam, 30-09-2018 To 06-10-2018, weekly panchangam Telugu

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *