అక్టోబ‌రు 7 నుంచి 13 వార‌ఫ‌లాలు

OCTOBER SECOND WEEK HOROSCOPE

మేషరాశి: ఈవారం ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి, చేపట్టిన పనుల విషయంలో స్పష్టత ఉండుట వలన మేలుజరుగుతుంది. జీవితభాగస్వామితో మీకున్న విభేదాలు కాస్త తగ్గుముఖం పడుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే ఆస్కారం ఉంది. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు.

వృషభరాశి: ఈవారం సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. కుటుంబలో నూతన ఆలోచనలకు అలాగే నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం. విదేశీప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చర్చాపరమైన విషయాల్లో పాల్గొంటారు. పూజాది కార్యక్రమాలు చేయుత వాటిలో పాల్గొనుట మంచిది. ఉద్యోగంలో అధికారుల నుండి సహకారం లభిస్తుంది.

మిథునరాశి: ఈవారం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉన్న, మీ మొండితనంతో ముందుకు వెళ్తారు. జీవిత భాగస్స్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయి. నూతన పెట్టుబడులు వారాం చివరలో అందుతాయి. కుటుంబంలో పెద్దలనుండి ముఖ్యమయిన విషయాలు తెలుస్తాయి, వాతై విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి, సంతానం వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుటకు అవకాశం ఉంది.

కర్కాటకరాశి: ఈవారం ఆర్థికపరమైన విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. చేపట్టిన పనులను మిత్రుల సహకారంతో ముందుకు తీసుకువెళ్ళుటకు అవకాశం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. సోదరులతో చర్చలకు అవకాశం ఉంది. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయుటకు ఆస్కారం ఉంది. బంధువుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో బాగానే ఉంటుంది. మీ ఆలోచనలు వారితో పంచుకుంటారు.

సింహరాశి: ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపార పరమైన విషయంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడే ఆస్కారం ఉంది. సంతానపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. విదేశాల్లో ఉన్నవారు వారి ఆలోచనలను బంధువులతో పంచుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది.

కన్యారాశి: ఈవారం ఆరంభంలో పనిఒత్తిడి ఉంటుంది, ప్రణాళిక లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకపోవడం మంచిది. మానసికంగా దృడంగా ఉండుట సూచన. కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. సోదరులతో చేపట్టిన చర్చలు ముందుకు సాగుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు,బంధువులను కలుసుకొనే అవకాశం ఉంది.

తులారాశి: ఈవారం బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత ఉండుట సూచన. మీ మాటతీరు మూలాన నూతన సమస్యలకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ముఖ్యమైన విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్లడం సూచన. కుటుంబంలో మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేస్తారు, వారినుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు, తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రయాణాలు వాయిదా పడుతాయి.

వృశ్చికరాశి: ఈవారం నూతన ఉద్యోగ అవకాశాలు ముందుకు సాగుతాయి, ప్రయత్నాలు కలిసి వస్తాయి. రావాల్సిన ధనమ్ విషయంలో స్పష్టత ఉండుట సూచన. బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. పెద్దలనుండి పూర్తిగా సహకారం లభిస్తుంది. విలువైన విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు తప్పక పోవచ్చును. స్త్రీ పరమైన విషయాల వలన లబ్దిని పొందుతారు, వారినుండి పూర్తిగా సహకారం లభిస్తుంది. మీ మాటతీరు విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. చిన్న చిన్న పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన వాహనాలనువ్ కొనుగోలు చేస్తారు.

ధనస్సురాశి: ఈవారం పెద్దలను కలుస్తారు , వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. తలపెట్టిన పనులను మిత్రుల సహకారంతో పూర్తిచేస్తారు. ఆరంభంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. వారం చివరలో మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు, విదేశాలలో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు. తగినంత విశ్రాంతు తీసుకోవడం మంచిది.

మకరరాశి: ఈవారం ముఖ్యమైన విషయాల్లో స్పష్టత కలిగి ఉండుట సూచన. కోపాన్ని తగ్గించుకోవడం వలన మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుండి పనిఒత్తిడి ఉంటుంది. బంధువుల నుండి రావాల్సిన సహకారం సమయానికి అందుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు తప్పక పోవచ్చును. చర్చలకు దూరంగా ఉండుట సూచన. విదేసి ప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. నూతన పరిచయాలు కలుగుతాయి.

కుంభరాశి: ఈవారం జీవితభాగస్వామితో కలిసి ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. చేపట్టిన పనులను నలుగురిని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. రావాల్సిన ధనం సమయానికి అందుతుంది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది, జాగ్రత్త. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా బలపడుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. మిత్రులతో కలిసి దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది, సమయాన్ని వారితో సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చర్చల్లో సమయం గడుపుతారు.

మీనరాశి: ఈవారం మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది , వారితో సమయం సరదాగా గడుపుతారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరమైన విషయంలో నూతన అవకాశాలు పొందుతారు. రావాల్సన ధనం సమయానికి చేతికి అందుతుంది. గతంలో ఆగిన పనులు ముందుకు కొనసాగుతాయి. బంధువులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. సంతానం విషయంలో గతంలో ఉన్న ఆందోళన తగ్గుటకు అవకాశం ఉంది.

– డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు, సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం) ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
www.janmalagna.com
9989647466

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *