అక్టోబ‌రు 14- 20 దాకా వార‌ఫ‌లాలు

OCTOBER THIRD WEEK HOROSCOPE

మేషరాశి :  ఈవారం ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం సూచన. అధికారులతో ఆరంబంలో విభేదాలు రాకుండా సరిచూసుకోండి. వారం చివరలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అనుకోకుండా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. సంతానం విషయంలో గతంలో ఉన్న ఆందోళన తగ్గుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. 

 

వృషభరాశి : ఈవారం మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థికపరమైన విషయాల్లో రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. సంతానం విషయంలో నలుగురి ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. పూజాది కార్యక్రమంలో పాల్గొంటారు. విదేశీప్రయాణాలు చేయువారికి అనుకూలమైన సమయం. ఉద్యోగంలో అధికారుల నుండి పూర్తిగా సహకారం లభిస్తుంది. చర్చల్లో పాల్గొంటారు.

 

మిథునరాశి:  ఈవారం నూతన ఆలోచనలకు అలాగే మీ వ్యక్తిగత ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారు. గతంలో చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడుతాయి. మీ మాటతీరు కొంతమందికి నచ్చక పోవచ్చును. రావాల్సిన ధనం కాస్త ఆలస్యంగా చేతికి అందుతాయి. మీ సంతానం నలుగురిలో గుర్తింపును పొందుతారు. సంతోషకరమైన వార్తలను వింటారు. విలువైన వస్తువుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. మిత్రులతో మనస్పర్థలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోండి , సర్దుబాటు మేలుచేస్తుంది.

 

కర్కాటకరాశి : ఈవారం సంతానం విషయంలో ఆందోళన వద్దు, అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. చేపట్టిన పనుల విషయంలో స్పష్టత ఉండుట వలన తప్పక లబ్దిని పొందుతారు. కుటుంబంలో సభ్యుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. రుణపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. విదేశాలలో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వస్తారు. జీవిత భాగస్వామితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు, ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

సింహరాశి : ఈవారం ఎవ్వరితోను మాటపట్టింపులు వెళ్ళకండి. సాధ్యమైనంత మేర చిన్న చిన్న విషయాలను సైతం అశ్రద్ధ చేయకండి. మిత్రులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబసభ్యులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. ఆత్మీయులను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. పెద్దలను కలుసుకొనే అవకాశం ఉంది.

 

కన్యారాశి : ఈవారం పెద్దలతో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ఉద్యోగంలోం బాగాఉంటుంది, నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. గతంలో రావాల్సిన ధనం కొంతమేర చేతికి అందుతుంది. సంతానం వలన సంతోషాన్ని పొందుతారు, వారై విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. బంధువులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. రుణపరమైన విషయాల్లో కాస్త స్పష్టత కలిగి ఉండుట సూచన. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట మంచిది.

 

తులారాశి: ఈవారం వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. పెట్టుబడుల విషయంలో అనుకూలమయిన ఫలితాలు పొందుతారు. కొంత సొంత ఆలోచనలు కలిగి ఉండి వాటిని అమలుచేసే ప్రయత్నం చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. కుటుంబ పరమైన విషయాల్లో మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. సోదరునితో వారై గురుంచే చర్చలు చేస్తారు, ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి.

 

వృశ్చికరాశి : ఈవారం మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు, నూతన పరిచయాలకు అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. గతములో చేపట్టిన పనుల వలన నలుగురిలో గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును. ముఖ్యమైన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం వలన ఇబ్బందులు పొందుతారు. ఆత్మీయలను కలుసుకొనే అవకాశం ఉంది. కుటుంబంలో నూతన ఆలోచనలుకు ప్రాధాన్యం ఇస్తారు. పెద్దలతో చర్చలు చేయుటకు అవకాశం కలదు.

 

ధనస్సురాశి: ఈవారం ముఖ్యమైన విషయాలకు అధిక సమయం ఇవ్వడం మంచిది. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ద అవసరం. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. స్వల్పదూర ప్రయాణాలు కలిసి వస్తాయి.

 

మకరరాశి : ఈవారం బంధువులను కలుస్తారు, వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. తలపెట్టిన పనులను అనుక్జున్న సమయానికి పూర్తిచేస్తారు. జీవితభాగస్వామి నుండి నూతన విషయాలు తెలుస్తాయి. తండ్రి తరుపు వారినుండి వచ్చే సూచనలను బాగా ఆలోచింది పరిగణలోకి తీసుకోండి. పూర్వీకుకుల నుండి రావాల్సిన ధనం కొంత నష్టపోయే ఆస్కారం ఉంది. మానసికంగా దృడంగా ఉండుట సూచన. వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీస్కోవడం మంచిది.

 

కుంభరాశి : ఈవారం సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ముఖ్యమైన ఆలోచనలలో సమయం గడుపుతారు. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్న బంధువులు లేక మిత్రుల నుండి సహకారం లభిస్తుంది. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది, కావున ప్రయాణాలు వాయిదా వేయుట సూచన. సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చర్చలకు దూరంగా ఉండుట సూచన.

 

మీనరాశి : ఈవారం ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. సంతానం గురుంచి ఉన్న ఆందోళన తగ్గుముఖం పడుతుంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. నూతన అవకాశాలు పొందుతారు. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. మిత్రులనుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకోండి , అనుకోని సహాయం పొందుతారు. గతంలో మద్యలో ఆగిన పనులు ముందుకు సాగుతాయి. బంధువులను కలుస్తారు, వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు.

 

 
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)    ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Telugu Panchangam

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *