పరకాల ప్రభాకర్ సర్వే విడుదల

Parakala Prabhaker Servey results released

మరికొన్ని గంటల్లో తెలంగాణ పోలింగ్ జరగబోతున్నది. ఓటరు తీర్పు చెప్పబోతున్నారు. ఫలితాలు ఎలా ఉంటాయి అనేది డిసెంబర్ 11వ తేదీనే క్లారిటీకి వచ్చేది ఉన్నా, రాజకీయ పార్టీలు, ఏజెన్సీలు సర్వేలతో హడావిడి చేస్తున్నాయి. లగడపాటి సర్వేపై రాద్దాంతం జరుగుతున్న సమయంలోనే చంద్రబాబుకి నమ్మినబంటు, ఏపీ మీడియా సలహాదారుగా, ఏపీ, టీడీపీ సోషల్ మీడియా అడ్వయిజరీగా పని చేసిన పరకాల ప్రభాకర్ సర్వే విడుదల అయ్యింది. తెలంగాణ ఎన్నికలపై ఆయన చెప్పిన లెక్కలు షాకింగ్ కు గురి చేస్తున్నాయి.

పరకాల సర్వే రిజల్ట్స్:

టీఆర్ఎస్: 72-75 సీట్లు
కాంగ్రెస్: 26-28 సీట్లు
టీడీపీ: 4-5 సీట్లు
ఎంఐఎం: 7 సీట్లు
బీజేపీ: 2 సీట్లు
ఇతరులు: 2 సీట్లు

మహాకూటమి భారీ ఓటమి మూటగట్టుకోబోతున్నది పరకాల ప్రభాకర్ సర్వే స్పష్టం చేస్తోంది. రెండు నెలలుగా, 8 వారాలు నిరంతరం ప్రజాభిప్రాయాలు సేకరించిన తర్వాతే ఈ ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. పరకాల సర్వే ఫలితాలతో కూటమికి చావుదెబ్బ ఖాయంగా కనిపిస్తోంది. పోలింగ్ కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉన్న టైంలో విడుదల అయిన పరకాల సర్వే పార్టీల్లో ప్రకంపనలు రేపుతోంది. సర్వేలు, విశ్లేషణల్లో ఎంతో మేధావిగా ప్రాచుర్యంలో ఉన్న పరకాల సర్వేపైనే ఇన్నాళ్లు చంద్రబాబు ఆధారపడ్డారు. కూటమికి వ్యతిరేకంగా పరకాల రిపోర్ట్ ఇవ్వటం వల్లే ఆయన్ను పక్కనబెట్టి, లగడపాటిని లైన్లోకి తీసుకుని ఆయన ద్వారా తప్పుడు సర్వేలు ఇప్పిస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ సమయంలోనే అసలు సర్వే ఇది అంటూ పరకాల లెక్కలు విడుదల చేయటం కూటమికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

Parakala Prabhaker Servey results released , telangana elections News, Telugu news, Parakala Prabhaker , Telangana Elections Shocking News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *