క‌మ‌లంలో స్వామి ప‌రిపూర్ణానంద పై వ్య‌తిరేక‌త‌

Paripoornananda Swamy

బీజేపిలోకి కొత్తగా చేరిన స్వామి పరిపూర్ణానంద ఇప్పడు పార్టీలో హాట్ టాపిక్ గా మారారు.. మొదట పార్టీ గెలుపు కోసమే తాను కృషి చేస్తానని చెప్పిన ఆయన ఆ తరువాత గన్ పార్క్ లో అమరుల స్తూపానికి నివాళులు అర్పించి పార్టీ ఆదేసిస్తే ఎక్కడ నుంచి ఆయన పోటీకి సిద్దం అని ప్రకటించారు.. ఇప్పుడు ఇదే ఆయనకు పార్టీలో వ్యతిరేకతను పెంచుతోంది.. ఆయన పార్టీలో చేరిన తరువాత మొదటి సారి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చి లక్ష్మణ్ ను కలిసారు. గౌరవపూర్వక సత్కారం తరువాత ఆయన్ను పార్టీలోకి స్వాగతిస్తూ లక్ష్మణ్ తన చాంబర్ లో తన సీటు పక్కనే స్వామీజికి సీటు వేయించి కుర్చోబెట్టుకున్నారు.. అయితే ఆ తరువాత ఆ సీటు అలాగే ఉండిపోవడం ఇప్పుడు పార్టీలో చర్చానీయాంశంగా మారింది… స్వామి పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఆ సీటులోనే కుర్చోవడంతో అధ్యక్ష హోదాలో ఉన్న లక్ష్మణ్ కు ఇబ్బందిగా మారింది.. ఇదే అంశాన్ని లక్ష్మణ్ తన సన్నిహితులతో చెప్పుకోని వాపోయినట్లు సమాచారం. పార్టీలో గతంలో ఎప్పుడు అధ్యక్షుడు సీటు పక్కన మరో సీటు ఏర్పాటు చేసిన సందర్భాలు లేవని పార్టీ నేతలే అంటున్నారు. ఎవరైనా జాతీయ పార్టీ నేతలు వచ్చినప్పుడు తాత్కాలికంగా అధ్యక్ష స్థానం పక్కన సీటు ఏర్పాటు చేసినా అవి వారు వెళ్లిన వెంటనే తీసేసే వాళ్లు అయితే ఇప్పుడు స్వామీజీ సీటు పరిమినెంటుగా అక్కడే ఉండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరో వైపు సీఎం అభ్యర్థి తానే అనే విధంగా పార్టీలో స్వామీజీ వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు వాపోతున్నారు. పార్టీలో మొదటి నుంచి కష్టపడి పని చేసిన తాము కాదని ఇప్పటికిప్పుడు పార్టీలో చేరిన వాళ్లు హడావుడి చేయడమేంటని పార్టీలోని కొందరు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు.. ఉత్తర ప్రధేశ్ లో యోగీ తరహాలో ఇక్కడ చేయాలనుకుంటే కుదరదని అక్కడ పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు పూర్తిగా బిన్నమని పార్టీ నేతలు అంటున్నారు. యూపిలో యోగి పార్టీ కోసం ఎంతో కృషి చేసారని ఆయనతో పరిపూర్ణానందను పోల్చడం సరికాదని సీనియర్లు అంటున్నారు.. అయితే పరిపూర్ణానంద వర్గం మాత్రం సీఎం అభ్యర్ధి స్వామీజీ అని ప్రచారం చేస్తున్నారు.. ఆ మేరకు పార్టీ హైకమాండ్ నుంచి స్పస్టమైన సందేశం ఉందని అంటున్నారు.. పూర్తి హమీతోనే పార్టీలో చేరారని స్వామీజి వర్గం చెబుతోంది.. అందులో భాగంగానే ఆయన రాష్ట్రం మొత్తం పర్యటించి ప్రచారం నిర్వహస్తున్నారని అంటున్నారు.. సీఎం అభ్యర్థి కాబట్టే పార్టీ అధ్యక్షుడు సీటు పక్కనే స్వామీజికి సీటు ఏర్పాటు చేసారని ఆయన వర్గం పరిపూర్ణానంద వర్గం ప్రచారం చేస్తుంది… వ‌చ్చి రాగానే సీనియర్లకు కొరకారాని కొయ్యగా మారిన స్వామీజి భవిషత్తులో ఇంకెన్ని వివాధాలకు కేంద్ర బిందువు అవుతారో వేచి చూడాలి…

Paripoornananda Swamy , Opposition on Paripoornananda Swamy in  BJP Party, Latest Political news on Paripoornananda Swamy

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *