ఇదేం సినిమా కాదు పవన్

This is not the movie Pawan

  • జనసేన అధినేతపై కత్తి మహేష్ విమర్శలు
  • జనాలు అరిస్తే ముఖ్యమంత్రి అవ్వవు అంటూ ట్వీట్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరోసారి వ్యంగాస్త్రాలు సంధించారు. పవన్ ను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. ‘జనం అరిస్తే, దేవుడు దయ తలిస్తే హిట్టవ్వడానికి ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా పవన్? సినిమాకైతే కథ బాగుండాలి.. దాన్ని బాగా తెరకెక్కించగలగాలి. రాజకీయాల్లో అయితే నువ్వేంటో తెలియాలి. గెలిస్తే ఏం చేస్తావో చెప్పాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చగలనని ప్రజలను నమ్మించాలి. నీ తరఫున నిలబడినవాళ్లు మెజారిటీ స్థానాలు గెల్చుకోవాలి. అప్పుడే నువ్వు సీఎం అవుతావ్. తెలుసుకో పవన్’ అని ట్వీట్ చేశారు. దీంతో పవన్ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు దించుకుంది. కత్తిపై వారంతా మండిపడుతున్నారు. గతంలో కూడా పవన్ అభిమానులు, కత్తి మహేష్ మధ్య గట్టి యుద్ధమే జరిగింది. చివరకు రాజీకొచ్చారు. అనంతరం హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిపై కత్తి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్న ఆరోపణలపై కత్తి మహేష్ ని హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. దీంతో ఆయన తెలుగు రాష్ట్రాలకు దూరంగా మకాం మార్చాడు. అప్పటి నుంచి పవన్ పై ఎలాంటి విమర్శలూ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల పవన్ తూర్పుగోదావరి పిఠాపురంలో ఓ సభలో ప్రసంగించారు. సభకు వచ్చినవారంతా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో పవన్ స్పందిస్తూ.. శ్రీపాద వల్లభుడి ఆశీర్వాదం ఉంటే తాను తప్పకుండా సీఎం అవుతానని వ్యాఖ్యానించారు. దీంతో పవన్ మరోసారి తన ట్విటర్ ద్వారా పవన్ పై విమర్శలు చేశారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాల్సిందే.

Today Deals on amazon Check Out Here 

Buy more books form amazon in discount Sale Click Here

Pavan kalyan emotional speech, Latest politics in andhra pradesh, AP politics and updates, Andhra politics by power star

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *