ఆత్మహత్య చేసుకుందామని విమానం ఎత్తుకెళ్లాడు

Plane Stolen By Suicide

ఆత్మహత్య చేసుకుందామని విమానం ఎత్తుకెళ్లాడు

  • వాషింగ్టన్ లో ఫ్లైట్ మెకానిక్ దుశ్చర్య
  • విమానం క్రాష్ అయినా గాయాలతో బయటపడ్డ వైనం

ఓ విమానయాన సంస్థలో మెకానిక్ కు జీవితం మీద విరక్తి కలిగింది. ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు. ఇందుకోసం ఏకంగా విమానాన్నే ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. అంతే.. విమానాశ్రయంలో పార్క్ చేసి విమానాన్ని ఎత్తుకెళ్లిపోయాడు. గాలిలో రెండు మూడు చక్కర్లు కొట్టిన తర్వాత ఆ విమానం కూలిపోయింది. కానీ అతడు మాత్రం గాయాలతో బయటపడ్డాడు. అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం.. వాషింగ్టన్ సమీపంలోని సీటెల్ ఎయిర్ పోర్టు. అలస్కా ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం పార్కింగ్ నుంచి రన్ వే పైకి వెళ్లింది. అక్కడి నుంచి టేకాఫ్ తీసుకుని గాలిలోకి ఎగిరింది. గ్రౌండ్ స్టాఫ్ గందరగోళానికి లోనయ్యారు. ప్రయాణికులు ఎవరూ లేకుండా, పైలట్ కూడా దిగిపోయిన తర్వాత విమానం ఎగరడంతో భయపడ్డారు. ఉగ్రవాద చర్య ఏమోనని ఆందోళనకు గురయ్యారు. వెంటనే రెండు మిలటరీ విమానాలు ఆ విమానాన్ని వెంబడించాయి. ఆకాశంలో రెండు మూడు చక్కర్లు కొట్టిన తర్వాత ఆ విమానం సీటెల్ విమానాశ్రయానికి 30 కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు.. విమాన శకలాల నుంచి బయటపడిన వ్యక్తిని గుర్తించారు. అతడు అదే సంస్థలో పనిచేస్తున్న మెకానిక్ కావడంతో ఆశ్చర్యపోయారు. అయితే, ఇది ఉగ్రవాద ఘటన కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. విమానం కూలిన సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. క్రాష్‌ అయిన విమానం 76 సీట్ల సామర్థ్యం గల విమానం అని, ఆత్మహత్య చేసుకునేందుకు అతను ఇలా చేసి ఉంటాడని అనుమానిస్తున్నామని తెలిపారు. ఈ విమానం గాలిలో చక్కర్లు కొడుతూ.. క్రాష్‌ అయిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Telugu Latest News, International News,Telugu News Updates, Washington Updates

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *