పోల‌వ‌రంపై అనుమాన‌పు మేఘాలు

Polavaram Prtoject News

కేంద్రం రాష్ట్రం నువ్వా నేనా అన్న‌ట్లు త‌ల‌ప‌డుతున్నందున‌
పోల‌వరం త‌గువు తెర‌పైకి వ‌చ్చింది
దీంతో కొత్త కొర్రీలు అధికారుల‌కు త‌ల‌నొప్పిగా మారాయి
అద‌నంగా రాష్ట్రం వెచ్చించిన 3500 కోట్ల రూపాయ‌లు వ‌స్తాయో రావో అన్న అనుమానం ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌ను పీడిస్తోంది.
నితిన్ గ‌డ్క‌రి తానే అంతా చూసుకుంటాన‌ని ఇచ్చిన మాట సైతం అమ‌లుకు నోచుకోలేదు
ప్ర‌తిష్టాత్మ‌క పోల‌వ‌రం ప్రాజెక్టుపై ప‌లు అనుమానపు మేఘాలు క‌మ్ముకున్నాయి.కేంద్రం ఇర‌వై అభ్యంత‌రాల‌ను వెలుగులోకి తెచ్చింది.వీటిపై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.ఇదివ‌ర‌కే ప్రాజెక్టుకు సంబంధించిన వివ‌రాల‌న్నీ అందించిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ కేంద్రం కొత్త అభ్యంత‌రాల‌ను తెర‌పైకి తెచ్చింది.ముఖ్యంగా భూసేక‌ర‌ణ‌, ప‌రిహారం త‌దిత‌ర అంశాల‌పైనే దృష్టి కేంద్రీక‌రించింది. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అధికారులు మ‌రో మారు ఢిల్లీకి వెళ్ల‌నున్నారు.కేంద్రానికి, రాష్ట్రానికి ఇప్ప‌టికే అనేకానేక విభేదాలు ఉన్న‌నేప‌థ్యాన తాజా పంచాయితీ ఎలా తీరుతుందో అన్న ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది.ఓవైపు అధికారులు తాము అన్ని వివ‌రాలు ఇచ్చామ‌ని అంటుంటే కేంద్రం మాత్రం ఇందుకు భిన్నంగా త‌న వాద‌న వినిపిస్తోంది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విష‌య‌మై డైలామా నెల‌కొంది.

Polavaram Prtoject News, AP Polavaram Project Update news, Nitin Gadkari , Central Government news on Polavaram project News, Telugu news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *