పొన్నాలకు ఊరట.. మర్రికి చెక్

Ponna Laxmi was Happy and Marri was unhappy

  • జనగామ వదులుకున్న టీజేఎస్
  • సనత్ నగర్ నుంచి బరిలోకి టీడీపీ
  • కూన శ్రీశైలం గౌడ్ ను ఎంపిక చేసిన చంద్రబాబు
మహా కూటమి పొత్తులతో సిట్టింగ్ సీటు కోల్పోయే పరిస్థితుల నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బయట పడగా.. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డికి మాత్రం గండి పడింది. పొన్నాల ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ సీటును తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం ఆశించగా.. మర్రి సిట్టింగ్ స్థానం సనత్ నగర్ తమకు కావాలని టీడీపీ పట్టు బట్టింది. దీంతో గత కొంత కాలంగా ఆ సీట్లను కాంగ్రెస్ అధిష్టానం పెండింగ్ లో పెట్టింది.

ఈ నేపథ్యంలో పొన్నాల హస్తిన బాట పట్టి లాబీయింగ్ చేసుకుని విజయం సాధించారు. ఈ విషయంలో స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జోక్యం చేసుకుని కోదండరాంతో మాట్లాడారు. అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా హైదరాబాద్ వచ్చి కోదండరాంను ఒప్పించారు. దీంతో జనగామ బరిలో నుంచి ఆయన తప్పుకోవడంతో పొన్నాలకు అక్కడ టికెట్ కేటాయించారు. అయితేసనత్ నగర్ విషయంలో మర్రి శశిధర్ రెడ్డి తన పట్టు నిలుపుకోలేకపోయారు. కాంగ్రెస్ కొత్త మిత్రుడు చంద్రబాబు ఒత్తిడి మేరకు సనత్ నగర్ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో మర్రి భవిష్యత్ ఏమిటో తెలియకుండా ఉంది..

కాంగ్రెస్ అభ్యర్థులను సైతం చంద్రబాబు సూచనల మేరకు ఎంపిక చేసిన హస్తం పార్టీ.. మర్రి శశిధర్ రెడ్డికి మొండిచేయి చూపించింది. సనత్ నగర్ స్థానం నుంచి అభ్యర్థిగా ఎంపిక చేయని నేపథ్యంలో మర్రికి ఏమైనా హామీ ఇస్తారా లేక వేరే నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతారా అన్నది వేచి చూడాల్సిందే

Subscribe To TS NEWS CHANNEL

TSNEW Subscribe For More Entertainment News

Subscribe to Real Estate Guru For More property News and Updates

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *