నేడు నింగిలోకి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి42

PSLV-C42 Mission

నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి42… ఈ రోజు రాత్రి 10.08 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. దీనికి అన్ని ఏర్పాట్లు చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇది పూర్తిగా వాణిజ్యపరమైన ప్రయోగం కావటంతో దీని ద్వారా బ్రిటన్‌కు చెందిన నోవాసర్‌, ఎస్‌1-4 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్‌డౌన్‌ ప్రక్రియ నిన్న మధ్యాహ్నం 1.08 గంటలకు ప్రారంభం కాగా… 33 గంటలపాటు కౌంట్‌డౌన్ కొనసాగి… ఆ తర్వాత పీఎస్‌ఎల్‌వీ -సి42 నింగిలోకి దూసుకెళ్లనుంది. నోవాసర్‌, ఎస్‌1-4 ఉపగ్రహాలకు సర్వే శాటిలైట్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ సంస్థ రూపకల్పన చేసింది. ఇవి రెండూ భూపరిశీలన ఉపగ్రహాలు. సుదీర్ఘ విరామం తర్వాత ఇస్రో పీఎస్‌ఎల్‌వీ-సీ42 ప్రయోగం చేపట్టింది. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇది 44వ ప్రయోగం… ఇప్పటికే షార్ కేంద్రానికి ఇస్రో చైర్మన్ శివన్, షార్ డైరెక్టర్ పాండ్యన్, శాస్త్రవేత్తలు చేరుకుని కౌంట్‌డౌన్ ను పర్యవేక్షిస్తున్నారు.

Polar Satellite Launch Vehicle,Launch of PSLV-C42 Mission on Sep16,PSLV-C42 launch,ISRO set for PSLV-C42,PSLV-C42 Mission – ISRO,Nellore District,Satish Dhawan,telugu latest updates,to day breaking news,technology latest news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *