సెంచరీతో భారత్ ను ఆదుకున్న పుజారా

PUJARA TON SAVED INDIA

  • తొలిరోజు 9 వికెట్లకు 250 పరుగులు చేసిన టీమిండియా
  • అడిలైడ్ లో ఆసీస్ తో తొలి టెస్టు

అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తడబడింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. లోకేష్‌ రాహుల్‌ (2), మురళీ విజయ్‌ (11), విరాట్‌ కోహ్లీ (3), అజింక్యా రహానె(13), రోహిత్‌ శర్మ(37), రిషబ్‌ పంత్‌(25)లు విఫలమయ్యారు. 41 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో రోహిత్‌ శర్మ-రిషబ్‌ పంత్‌లు కాసేపు ఆచితూచి ఆడారు. తర్వాత వీరిద్దరూ సైతం వెనుదిరగడంతో టీమిండియా మరింత కష్టాల్లోకి వెళ్లింది. కంగారూ బౌలర్లు పదునైన బంతులు సంధించడంతో భారత జట్టు వికెట్లను వడివడిగా చేజార్చుకుంది. 15 పరుగులకే ఓపెనర్లు రాహుల్‌, విజయ్‌ పెవిలియన్‌కు చేరారు. తర్వాత వచ్చిన కెప్టెన్‌ కోహ్లి వెంటనే అవుటయ్యాడు. రహానే కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరాడు. తర్వాత రోహిత్‌, పంత్‌ కూడా ఔటయ్యారు. ఈ క్రమంలో టెస్ట్ స్పెషలిస్ట్ ఛటేశ్వర్ పుజారా ఒక్కడే మెరుగ్గా ఆడాడు. 231బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో సెంచరీ సాధించాడు. 153 బంతుల్లో అర్థ శతకాన్ని సాధించిన పుజారా.. మరో 78 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది పుజారా టెస్టు కెరీర్‌లో 16వ  సెంచరీ.  ఆసియా వెలుపల తొలి రోజు ఆటలో సెంచరీ చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా స్థానం సంపాదించాడు. ఈ జాబితాలో విజయ్‌ మంజ్రేకర్‌, సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, విరాట్‌ కోహ్లి, మురళీ విజయ్‌లు ఉన్నారు. కాగా, ఆరంభంలోనే వడివడిగా వికెట్లు పోగొట్టుకోవడంతో తొలిరోజే భారత జట్టు ఆలౌట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ పుజారా ఆటతీరుతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది. పుజారా(123; 246 బంతుల్లో7 ఫోర్లు, 2 సిక్సర్లు) తొమ్మిదో వికెట్‌గా  పెవిలియన్‌ చేరాడు.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *