పొగ ఎపుడు మానేయాలి?

Quit Smoking is Good Always
చాలాకాలంగా పొగతాగే అలవాటు ఉన్నవాళ్లని మానుకోమని చెబితే ఆ ఇపుడు మానేస్తే ఏం లాభమని కొట్టిపడేస్తుంటారు. పొగ తాగడాన్ని అలాగే కొనసాగిస్తుంటారు. నిజానికి పొగ అలవాటును ఎపుడు మానేసినా మంచిదే. పొగ మానేసిన క్షణం నుంచే క్యాన్సర్ ముప్పు తగ్గడం మొదలవుతుంది. పక్షవాతం, గుండె, ఊపిరితిత్తుల జబ్బులూ తగ్గుముఖం పడతాయి. శరీరం తిరిగి శక్తిమంతం కావడం మొదలుపెడుతుంది. రుచి, వాసన శక్తులు పెరుగుతాయి. దీంతో ఆకలి కూడా బాగా పెరుగుతుంది. వేళ్ల మీద ఏర్పడిన మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. చర్మం, దంతాల ఆరోగ్యం మెరుగవుతుంది. శారీరకంగా, మానసికంగా మొత్తంగా ఒక నూతనోత్తేజం మొదలవుతుంది.
Health Updates

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *