విలువ‌లు కాపాడే చ‌ర్య‌లేనా ఇవి..

Rahul Latest news
ప్ర‌జాస్వామ్యం, వ్య‌వ‌స్థ‌లు, దేశాన్ని కాపాడ‌డ‌మే మా ధ్యేయం అన్నారు రాహుల్ .. ఇదే త‌రహాలో చంద్ర‌బాబు కూడా మాట్లాడి క‌నీస ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ ఒక‌టి రూపొందించుకుని ముందుకు వెళ్తాం అన్నారు చంద్ర‌బాబు..ఎవ‌రి ఎజెండాలు వారివి అయిన‌ప్పుడు ఇక కామ‌న్ అజెండ్ ని తెర‌పైకి తెచ్చి ఏం చేస్తార‌ని.ప్ర‌జాస్వామ్యం ప్ర‌తి ఐదేళ్ల‌కోసారి అప‌హాస్యం పాల‌వుతూనే ఉంది క‌దా.. కేవ‌లం రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ధ్యేయంగా ఉన్న మ‌నుషులు సంబంధిత విలువ‌ల‌ను ఎలా కాపాడ‌తార‌ని.. ఇవాళ కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా త‌మ పార్టీల భ‌విష్య‌త్ గురించి ఆలోచిస్తాయే కానీ ప్ర‌జ‌ల మంచీ చెడూ అన్న‌వి త‌మ ప్ర‌యోజ‌నాల‌కు అతీతంగా ప‌ట్టించుకోవు క‌దా.. ఈ క్ర‌మాన చంద్ర‌బాబు కాంగ్రెస్ తో క‌ల‌వ‌డం ఓ గొప్ప నిర్ణ‌యంలా అనుకూల మీడియాలు గొంతెత్తి అరిచినా ఇవాళ ఆంధ్రా టీడీపీకి పొత్తులు అన్న‌వి అన‌వ‌స‌రం. తెలంగాణ‌లో పార్టీని బ‌తికించుకునేందుకే పొత్తులు అన్న‌ది స్ప‌ష్ట‌మైన విష‌యం. కానీ ఎందుక‌నో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పొత్తుల‌కు బాబు సై అన‌డం ఒకింత ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. మోడీని ఢీ కొనేందుకే తాను ఇదంతా చేస్తున్నాన‌ని చెప్ప‌డం పెద్ద‌గా ప్ర‌జ‌ల అంగీకారం పొంద‌ని మాట‌గానే మిగిలిపోవ‌చ్చు. ఓ విధంగా విప‌క్షాల‌కు చంద్ర‌బాబే అస్త్రాలు అందించి త‌న‌పై దాడి చేయించుకుంటున్నారు.ఈ లెక్క‌న జ‌గ‌న్ కు సునాయాసంగా అధికారం ద‌క్కేందుకు బాబే ఓ విధంగా సాయం చేసిన‌ట్లు.
Rahul Latest news , congress Party Latest News, Telugu News, Telugu Breaking News, AP Political news, Rahul Gandhi Political News,

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *