శంక‌ర్ ని ఇంట‌ర్వ్యూ చేసిన రాజ‌మౌళి

RAJAMOULI INTERVIEWED SHANKAR..
సెల‌బ్రిటీలు క‌లిసి మ‌రో సెల‌బ్రిటీని ఇంట‌ర్వ్యూ చేయ‌డం అరుదుగా క‌నిపిస్తుంది. అలాంటి స‌న్నివేశం రోబో 2 ఆడియో లాంచ్‌లో క‌నిపించింది. ఈ సందర్భంగా కొందరు సెలబ్రిటీలు శంకర్‌ను కొన్ని ప్రశ్నలడిగారు. వాటికి శంకర్‌
సమాధానాలిచ్చారు. మరోవైపు ఆయన కూడా తన స్పీచ్‌ ఇచ్చారు. ముందుగా, బాహుబ‌లి డైరెక్ట‌ర్ రాజ‌మౌళిని ఓ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌ను సంధించారు. అదేమిటంటే..

ఇంత పెద్ద బడ్జెట్‌ సినిమాను తీస్తున్నప్పుడు ప్రెజర్‌ను ఎలా మేనేజ్‌ చేశారు? రోబో తర్వాత రజనీగారి ఫ్యాన్స్‌కి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువుంటాయి. వాటిని ఎలా మీట్‌ చేయబోతున్నారు?

శంకర్‌: నేను రాజమౌళిగారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన ఇండియన్‌ సినిమాకు చాలా గౌరవం తెచ్చిన వ్యక్తి. ప్రెజర్‌ని హ్యాండిల్‌ చేయడం అనేది ఇంకా ఎక్కువ పని చేయడమే. సినిమాకు సంబంధించిన ప్రతి ఫ్యాక్ట్‌ని ఎనలైజ్‌ చేస్తాను. అన్నీ కరెక్ట్‌ గా ఉన్నాయా లేదా అని ఆలోచిస్తాను. ఎక్స్‌పెక్టేషన్‌ గురించి చెప్పేటప్పుడు ‘2.0’లో రజనీసార్‌ని వసీగా, చిట్టిగా, 2.0గా, జెయింట్‌ చిట్టిగా చూస్తాం. ఇంకా కొన్ని సర్‌ప్రైజ్‌లున్నాయి. ఎక్స్‌పెక్టేషన్‌ని మీట్ అవుతుందని నేను నమ్ముతున్నా.

శివరాజ్‌ కుమార్‌: మీకు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? టైటిల్స్ అంత యాప్ట్‌ గా ఎలా పెడుతున్నారు? మీకు కుదిరితే భవిష్యత్తులో మీతో ఒక సినిమా చేయాలని ఉంది.

శంకర్‌: ఇలాంటి ఆలోచనలు గాలి నుంచి వస్తాయా? పైనుంచి వస్తాయా? అనేది నాకు తెలియదు. కానీ ఆడియన్స్‌కి ఏదో కొత్తగా చూపించాలని ఆలోచిస్తాను. ఆ ఆలోచనల నుంచే వస్తాయేమో. ఇక కథ గురించి ఆలోచించేటప్పుడే సరైన టైటిల్‌ వస్తుంది. ఒకవేళ రాకపోతే ఎనలైజ్‌ చేసి పెట్టడమే. ‘2.0’ విషయానికి వస్తే.. ఈ టైటిల్‌ గురించి
మాట్లాడాంటే.. మామూలుగా టెక్నికల్‌ లాంగ్వేజ్‌లో చెప్పేటప్పుడు వెర్షన్ సెకండ్‌ అని, ఇంకోటని అంటారు. 2.0 అని అంటే ఏ లాంగ్వేజ్‌ అయినా తప్పకుండా రీచ్‌ అవుతుందనిపించింది. అందుకే పెట్టాను. కన్నడ సూపర్‌స్టార్‌ అయి ఉండి ఆయన నాతో పనిచేయాలనుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నా. తప్పకుండా చేస్తాను.

కన్నడ నటుడు ఉపేంద్ర ప్రశ్న: నాలాంటి డైరక్టర్‌ కమ్‌ హీరోకి, శంకర్‌గారు, రజనీగారు ఏమైనా టిప్స్‌ ఇస్తారా?

శంకర్‌: నేనేంటి ఆయనకు టిప్స్‌ ఇచ్చేది. ఆయన గొప్ప డైరక్టర్‌. ఆయన ‘ఉపేంద్రస‌, ‘ఎ’ అనే సినిమాలు నాకు నచ్చిన సినిమాలు. ఇన్‌స్పయిరింగ్‌గా ఉంటాయి. ‘ఎ’ సినిమా ఫస్ట్‌ సీనే క్లైమాక్స్‌లా ఉంటుంది. ఎవరికైనా వర్తించే సూత్రం ఒకటే. మీకు కన్వినియంట్‌ నిర్మాత, ప్రొడ్యూసర్‌, టెక్నీషియన్స్‌తో పనిచేయవద్దు. సరైన సబ్జెక్ట్‌ని ఎంపిక చేసుకుని, దానికి తగ్గ టెక్నీషియన్స్‌ని ఎంపిక చేసుకుని పనిచేస్తే అన్ని సినిమాలు విజయం సాధిస్తాయి.

CELEBRITIES INTERVIEWED DIRECTOR SHANKAR

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *