ఒక సీన్ కోసం 45 రోజులు

Rajamouli New Movie
ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. న‌వంబ‌ర్ మొద‌టి వారంలోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ఉటుంది. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్క‌బోయే ఈ సినిమా గురించి ఎన్నో విష‌యాలు సోష‌ల్ మీడియాలో విన‌ప‌డుతున్నాయి. తాజాగా ఈ సినిమా కోసం రాజ‌మౌళి భారీ ఇంట‌ర్వెల్ యాక్ష‌న్ బ్లాక్‌ను ప్లాన్ చేశాడ‌ట‌. ఈ సీన్ ను 45 రోజుల పాటు చిత్రీక‌రించ‌నున్నారట‌. న‌వంబ‌ర్ తొలి వారంలో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌తో పాటు మ‌రో విదేశీ హీరోయిన్‌తో క‌లిసి న‌టించ‌బోతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే మెయిన్ హీరోయిన్స్‌ను అనౌన్స్ చేస్తారు. డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 2020లో సినిమా విడుద‌ల కానుంది.
45 days for one scene , Director Rajamouli  New Telugu Movie With Ram Charan, JR NTR  

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *