రామ్ చరణ్ భార్య ఉపాసన అలా చేసిందా?

 Ram Charan wife Upasana news

రామ్ చరణ్ భార్య ఉపాసన అత్త సురేఖ ను షాక్ కు గురి చేసారు. అత్త గారిని కోడలు ఉపాసన భయపెట్టారు. ఉపాసన చేసిన పనికి చిరు భార్య సురేఖ బెంబేలెత్తిపోయారు. ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాతావరణం చూసి ఉలిక్కిపడ్డారు. ఇంతకీ సురేఖ అంతలా భయపడేలా చిరంజీవి ఇంట్లో ఏం జరిగింది అంటే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ అందరూ దెయ్యాల అవతారం ఎత్తారు. చిరంజీవి ఇంట్లో అందరూ కలసి పెద్ద సందండి చేసారు. ఈ నెల 31 తో హాలోవీన్ వేడుకలు ముగుస్తాయన్న నేపధ్యంలో పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా మెగా ఫ్యామిలీ మొత్తం చాలా చాలా విచిత్ర వేషధారణలతో సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, స్నేహారెడ్డి, నిహారిక, సుస్మిత శ్రీజ కల్యాణ్ దేవ్, ఉపాసన తదితరులు వివిధ రకాల గెటప్‌లలో కనిపించి భయపెట్టారు. ఇక రాంచరణ్ భార్య తన అత్తమ్మ మెగస్టార్ చిరంజీవి భార్య సురేఖను బాగానే ఆట పట్టించింది. తన సోషల్ మీడియాలో ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది..‘స్వీటెస్ట్ అత్తమ్మ. భయంకరమైన కోడలు’ అంటూ ‘హాలోవీన్’ పార్టీ క్యాప్షన్‌తో పిక్‌ను షేర్ చేశారు ఉపాసన. అయితే రాంచరణ్ మాత్రం మాల వేసుకోవటంతో సింపుల్ గానే వున్నారు కానీ మిగతా సభ్యులందరు విచిత్రమైన గెటప్స్ తో ఒకే ఫ్రేమ్ లో హల్ చల్ చేసారు..ఈ పిక్స్ చూసిన మెగా అభిమానుల సంతోషానికి హద్దులు లేవు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి దెయ్యాల గెటప్ లో అందరూ కలిసి సురేఖను జడిపించారు. చూడగానే భయం కలిగించే గెటప్ లలో ఇల్లంతా ఘోస్ట్ సామ్రాజ్యంలా తయారు చేశారు. ఎవరికి నచ్చిన ఆటను వాళ్ళు ఆడుకున్నారు. హాలోవీన్ ఫెస్టివల్ ను ఫుల్ సెలబ్రేట్ చేసుకుని సందడి చేశారు.

 Ram Charan wife Upasana news,

Ram Charan wife Upasana , Upasana Latest news , Telugu news Update.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *