ఉత్తమ్, జానాలకు రామోజీ షాక్… ఇది నిజమేనా

Ramoji Rao CM Candidate.. Jaipal Reddy

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ లోని ఆ నేతలకు రామోజీ రావు షాక్ ఇవ్వనున్నారు. సీఎం రేసులో ఉన్న ఆ ఇద్దరు నేతలు కాకుండా తెరమీదకు మరో బడా నేతను తెచ్చి రామోజీ వారికి ఝలక్ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్‌కి కేరాఫ్‌ అంటే ఈ ఇద్దరు నేతలే అను చెప్తారు. ఒకరు సీనియర్‌ నేత, కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత జానా రెడ్డి. మరొకరు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ఇద్దరూ పాత ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలే. కాంగ్రెస్‌ గెలిస్తే ఈ ఇద్దరు నేతలు సీఎం రేస్‌లో ముందున్నారు అనే విషయం అందరికీ తెలుసు. కానీ వారికి రామోజీ నుండి ఊహించని షాక్ తగిలింది.

సీఎం రేస్‌లో ముందున్న ఈ ఇద్దరు నేతలను కాదని, రామోజీరావు కాంగ్రెస్‌ తరఫున మరో బడా నేతను ముందుకు తీసుకొస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును తెలంగాణలో పొత్తు పెట్టుకోవాలని సూచించింది, రామోజీ చిరకాల మిత్రుడు అయిన ఆ నేతను సీఎం చేయడానికే అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. అయితే ఆయన ఎవరో కాదు.. జైపాల్‌ రెడ్డి అని చెబుతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది పక్కా నిజం అని రాజకీయ వర్గాల భోగట్టా.
జైపాల్‌రెడ్డి ,రామోజీకి మంచి అనుబంధమే ఉంది . మొదట నుండి జైపాల్ రెడ్డి ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రి కావాలని కలలు కన్నారు. అయితే అది సాధ్యం కాలేదు. రాష్ట్రం విభజించబడినా, తెలంగాణకు అయినా సీఎం కావాలని ఆయన భావిస్తున్న నేపధ్యంలో ఆయన రామోజీతో భేటీ అయి తన చిరకాల వాంఛను ముందు పెట్టడంతో, జైపాల్‌కి మద్దతు ఇవ్వడానికి రామోజీ ఓకే అన్నాడట. ఆ తర్వాత చంద్రబాబుతో పావులు కదిపినట్లు కాంగ్రెస్‌ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
ఈ వ్యవహారం ఇటు జానా, అటు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి తెలియడంతో వారు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. అయితే ఈ వ్యవహారంలో రామోజీతో డైరెక్ట్‌గా ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నారట. మరి, ఏం జరగనుందనేది త్వరలోనే తేలనుంది. మరోవైపు, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సీఎం కోసం ఇలాంటి కుర్చీలాటే ఉంటుందని, సీల్డ్‌ కవర్‌ ముఖ్యమంత్రులు వస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నా కాంగ్రెస్ నేతలకు రామోజీ ఇచ్చింది మాత్రం ఊహించని ట్విస్ట్ .

Ramoji given shock news to Uttam, Jana reddy , Ramoji Rao latest news, telugu news, Nalgonda District , Jaipal Reddy , telugu news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *