అసభ్యంగా ప్రవర్తించాడని రసమయిపై ఫిర్యాదు

rasamai news

టీఆర్ఎస్ ప్రకటించిన తొలి జాబితాలోనే రసమయి బాలకిషన్ కు మళ్ళీ టికెట్ ఇచ్చాడు  గులాబీ బాస్ కేసీఆర్. ఇప్పుడు తల పట్టుకున్తున్నాడు. రోజుకో వివాదంతో ప్రచారం లో కంపు కొట్టిస్తున్న రసమయి బాలకిషన్ పై తాజాగా ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో అసభ్యంగా ప్రవర్తించాడని, అసభ్యకరంగా బూతులు తిట్టాడని ఆ ఫిర్యాదులో పేర్కొంది.

మానకొండూర్‌ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్‌  అభ్యర్థిగా తిరిగి మానకొండూర్ నుండే టిక్కెట్ దక్కడంతో రసమయి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో రసమయికి  అడుగడుగునా నిరసనలే, వ్యతిరేఖతే వ్యక్తం అవుతుంది. ప్రజల నుంచి ఊహించని స్థాయిలో నిరసనలు వస్తుండటంతో ప్రచారాన్ని కూడా రద్దు చేసుకున్న  రసమయి అక్కడ ఎదురీదుతున్నారు. దాదాపు చాలా సార్లు అనేక గ్రామాల ప్రజలు తిరగబడటంతో రసమయి వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చింది.

   ఇదే క్రమంలో నవంబర్ 4న ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్ లో  రసమయి బాలకిషన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్లీ ఇప్పుడు రావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలు గత హామీలపై నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన రసమయి బాలకిషన్ మహిళలపై అసభ్యపదజాలంతో దూషించారనని కందికట్కూర్ గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డేకు ఫిర్యాదు చేసింది. మహిళల మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడటంతో పాటు భుజాలపై చేతులు వేసి చెప్పరాని విధంగా దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో రసమయి వివాదాలు పార్టీ కి తలనొప్పిగా మారాయి.

ఎలక్షన్  కోడ్ ఉన్న సమయంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించిన రసమయిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. రసమయి దుర్భాషలకు సంబంధించిన వీడియోలు, ఆడియో క్లిప్పింగ్ లను ఎస్పీకి జతపరచారు. జ్యోతితోపాటు మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, జ్యోతితోపాటు ఎస్పీని కలిశారు. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ పరువును రసమయి వరుస వివాదాలతో బజారున పెట్టారు.

rasamai news,telangana mla rasamai bala kishan latest news,lady complaints on telangana mla rasamai bala kishan,telangana mla rasamai bala kishan news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *