బ్లాక్ బ‌న్ గ‌యా వైట్

RBI Report On Demonetisation
మోడీ పాల‌న‌లో కీల‌క నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం ఎంత‌గా దేశాన్ని కుదిపేసిందో మ‌రువ‌లేం. నాటి చ‌ర్య సాహ‌సానికి ప్ర‌తీక అని కొంద‌రు వ్యాఖ్యానించారు. దేశంలో వ‌చ్చిన ఈ కీల‌క సంస్క‌ర‌ణ ఎన్నో మార్పుల‌కు ఆజ్యం పోస్తుంద‌ని భావించారు. అవ‌న్నీ జ‌ర‌గ‌ని ప‌నులుగానే మిగిలిపోయాయి. న‌ల్ల ధ‌నం కాస్తా అంతా అనుకున్న‌ట్లు పెద్ద‌లు అనుకోన‌ట్లు నోట్లు తెల్ల‌ధ‌నంగా మారిపోయి విప‌ణిలో చెలామ‌ణి అయిపోయాయి. మోడీ ఆవేశ‌పూరితంగా నాడు చేసిన ప్రసంగం ఇప్పుడు డొల్లేన‌ని తేలిపోయింది. ఏమీ క‌ట్ట‌డి చేయ లేని చోట ఎందుకింత ఆర్భాట‌మో అని విస్తుబోవ‌డం ప్ర‌జ‌ల వంతయ్యింది. తాజాగా నాటి నిర్ణ‌య ఫ‌లితాల‌ను ఆర్బీఐ లెక్క‌ల రూపాన వెలువ‌ర్చింది. 15 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను ర‌ద్దు చేయ‌గా అందులో మూడో వంతు న‌ల్ల‌ధ‌నం ఉంటుంద‌ని అది కాస్త ర‌ద్ద‌యిపోతుంద‌ని భావించారు. కానీ ప‌దివేల కోట్ల రూపాయ‌లు మాత్ర‌మే వెన‌క్కు రాలేద‌ని మిగిలిన మొత్తం తెల్ల‌ధ‌నంగా మారిపోయింద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. దీనిపై మోడీ ఏమ‌ని స్పందిస్తారో!
RBI Report On Demonetisation,Report On Demonetisation,Modi Demonetisation,Delhi Latest Updates,Telugu Latest Updates,RBI Caluculations On Demonetisation,Breaking News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *