రెడ్ మి నోట్ 6 ప్రోకి అనూహ్య స్పందన

redmi note 6 pro new phone

·  తొలిరోజే 6 లక్షల ఫోన్ల అమ్మకాలు

చైనా మొబైల్ తయారీ కంపెనీ షావోమీ భారత్ లో కొత్తగా విడుదల చేసిన రెడ్ మీ నోట్ 6 ప్రో స్మార్ట్ ఫోన్ కి అనూహ్య స్పందన లభించింది. తొలిరోజు ఏకంగా 6 లక్షల ఫోన్లు అమ్ముడయ్యాయని కంపెనీ పేర్కొంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే స్టాక్ మొత్తం అమ్ముడైపోయిందని వెల్లడించింది. బ్లాక్ ఫ్రైడే సేల్ లో భాగంగా శుక్రవారం ఎంఐ స్టోర్ తోపాటు ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ విక్రయాలు సాగాయి. కంపెనీ రూ.1000 డిస్కౌంట్ ఇవ్వగా.. హెచ్ డీఎఫ్ సీ కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారికి అదనంగా మరో రూ.500 తక్షణ రాయితీ లభించింది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా కంపెనీ నిర్ధారించింది. తొలిరోజు ఆఫర్ లో భాగంగా వీటిని రూ.12,999, రూ.14,999 కి అందించింది. అయితే, తొలిరోజు ఫోన్ దొరకనివారు నిరాశపడొద్దని, మళ్లీ శనివారం మధ్యాహ్నం మూడు గంటలక ఫ్లాష్ సేల్ నిర్వహించనున్నామని కంపెనీ వెల్లడించింది. తొలిరోజు ధరలకే రెండో రోజు కూడా వీటిని విక్రయించనున్నట్టు తెలిపింది. 6.26 అంగుళాల పెద్ద డిస్ ప్లేతో కూడిన రెడ్ మి నోట్ 6 ప్రో ఫోన్ లో వెనుకవైపు డ్యూయల్ కెమెరా ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి 12 మెగాపిక్సెల్ కెమెరా కాగా, రెండోది 5 మెగాపిక్సెల్ కెమెరా. అలాగే ముందు భాగంలో కూడా 20 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ తో రెండు కెమెరాలు ఉన్నాయి. ఇక 4000 ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉన్న బ్యాటరీ ఎక్కువ సేపు చార్జింగ్ ఉంచుతుంది.

redmi note 6 pro new phone,6 lakhs of redmi 6 pro phones sold out,6 lakhs redmi phones soldout in one day ,redmi note 6 pro new phone in to market

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *