కేసీఆర్ కుటుంబంపై రేవంత్ వ్యాఖ్యలు

Revanth comments on KCR Family

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల పోరులో పార్టీలు మాటలకు పదును పెడుతున్నారు. తమ వాగ్బానాలతో ప్రత్యర్ధులపై దాడికి దిగుతున్నారు. ప్రధాన పార్టీల మధ్య పోటీ ఏ స్థాయిలో ఉందో వేరే చెప్పక్కర్లేదు అందులోనూ టీకాంగ్రెస్ మరియు తెరాస పార్టీల మధ్య అయితే అది తారా స్థాయిలో ఉంటుంది. తెరాస పార్టీ నుంచి కేటీఆర్,కెసిఆర్ లు కాంగ్రెస్ నేతలకు కౌంటర్లు ఇస్తే కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు ఎదురు దాడి చెయ్యడంలో ముందు వరసలో ఉన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో జరిగినటువంటి టీకాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి తెరాస పార్టీ మీదను మరియు కెసిఆర్ కుటుంబం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఈ రోజు కర్రు కాల్చి కారు గుర్తుకు వాతలు పెట్టాల్సిన సమయం వచ్చిందని, కేసీఆర్‌ ఏమో సీట్లో కూర్చోకుండా అతని ఫామ్ హౌస్ లో మందు తాగి పడుకుంటాడని, అలాంటి వ్యక్తి నడిపేటటువంటి కారులో కూర్చుంటే ఆ బండి చక్కగా నడుపుతాడా? వారి ఇంట్లో ఒక్కొక్కడు కారులోని ఒక్కొక్కడు ఒక్కో పార్టును పట్టుకుపోతారని, హరీష్ హ్యాండ్ బ్రేక్ దగ్గర ఉంటే కవిత ఏమో యాక్సిలరేటర్ దగ్గర ఉంటుంది, కేటీఆర్ ఇంకెక్కడో ఉంటాడని, అలాంటప్పుడు వీరికి మద్దతు ఇస్తే మనకి మంచి జరుగుతుందా అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి కారు పార్టీ ని కారు పార్టీ నాయకులను గురించి కార్ డ్రైవింగ్ భాషలో చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి.

Revanth comments on KCR Family , Revanth Reddy comments on KCR Family , Telugu latest news , KTR, KCR , Congress  Update News, Uttam Kumar Reddy , Revanth reddy , Revanth Reddy  sensational comments on the TRS Party and the KCR family during the election campaign in  Narsapur , Medak district.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *