రేవంత్ అరెస్ట్ ఎఫెక్ట్ … వికారాబాద్ ఎస్పీ పై వేటు

revanth Reddy Arrest may effects vikarabad SP

రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపింది. తలుపులు పగలగొట్టి, బెడ్ రూమ్ లోకి వెళ్లి మరీ రేవంత్ ను ఈడ్చుకుపోయి ఎక్కడో నిర్బంధించిన ఘటనపై వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను ఎన్నికల విధుల్లో నుండి తప్పిస్తూ ఈసీ బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. అన్నపూర్ణ స్థానంలో అవినాష్ మహంతిని వికారాబాద్ ఎస్పీగా బదిలీ చేశారు. మంగళవారం నాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఈ నెల 4వ తేదీన కోస్గిలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సభ ఉన్నందున నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని మంగళవారం నాడు తెల్లవారుజామున ఇంటి నుండి అరెస్ట్ చేసి జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు.ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై మంగళవారంనాడు, బుధవారం నాడు విచారణ చేసిన హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.ఇవాళ మధ్యాహ్నం డీజీపీని హైకోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణ‌ను విధుల నుండి తప్పించారు.

Buy the Latest smart Phone Cheaper Price 

ఢిల్లీలో ఉన్న అవినాష్ మహంతిని వికారాబాద్ ఎస్పీగా నియమిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను వెంటనే డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు చేసింది.రేవంత్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా పోలీసుల తీరుపై కూడ విమర్శలు వచ్చాయి. నష్టనివారణ కోసం ఎట్టకేలకు ఈసీ ఈ నిర్ణయం తీసుకొంది. 2005 బ్యాచ్‌‌కు అవినాష్ మహంతి‌ వెంటనే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *